పటిష్టంగా బ్యాంకింగ్
పటిష్టంగా బ్యాంకింగ్
Published Wed, Aug 28 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
ముంబై: బ్యాంకింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాం క్(ఆర్‌బీఐ) వ్యూహ రచన చేస్తోంది. కొత్త బ్యాంకులకు కఠిన ‘ఎంట్రీ’ నిబంధనలతోపాటు, దేశీయ బ్యాంకింగ్ నాలుగు అంచెల పటిష్ట వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు ఉండాలని భావిస్తోంది. ‘భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ-పురోగతికి మార్గం’ అన్న శీర్షికన తాజాగా ఒక చర్చా పత్రాన్ని ఆవిష్కరించింది.
నాలుగు అంచెలు ఇలా...: నాలుగు అంచెల వ్యవస్థలో మొదటి వరుసలో విదేశీ బ్యాంక్ బ్రాంచీలుసహా దేశీయ-దేశీయేతర దిగ్గజ బ్యాంకులు 3-4 ఉంటాయి. రెండవ అంచెలో మిడ్-సైజ్ బ్యాంకులు ఉంటాయి. మూడవ కేటగిరిలో ఓల్డ్ సెక్టార్ ప్రైవేటు బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, మల్టీ స్టేట్ సహకార బ్యాంకులు పనిచేస్తాయి. చివరి శ్రేణిలో ప్రైవేటు లోకల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఉంటాయి.
Advertisement