Mumbai-Pune Expressway
-
సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్..
ముంబై : ఎదుటి వాళ్లు ఆపదలో ఉంటే సహాయం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. సొంత వాళ్లు ప్రమాదంలో ఉన్నా పట్టించుకోని రోజులు ఇవి. అయితే ముంబైలో జరిగిన ఓ సంఘటన మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. తోటి వ్యక్తికి సహాయం చేద్దామని ప్రయత్నించిన ప్రముఖ వైద్యుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు అతన్ని కబళించేసింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పూణెకు చెందిన వెన్నెముక నిపుణుడు డాక్టర్ కేతన్ ఖుర్జేకర్, మరో ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులతో కలిసి ముంబై నుంచి పూణేకు క్యాబ్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు సోమటనే గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో టైరు పాడైంది. దీంతో టైరు మార్చడానికి డ్రైవర్ కిందకు దిగాడు. అయితే మిగిలిన డాక్టర్లు కిందికి దిగి రిలాక్స్ అవుతుండగా, డాక్టర్ ఖుర్జేకర్ మాత్రం డ్రైవర్‌కు సాయం చేస్తున్నారు. ఇంతులో అకస్మాత్తుగా ఓ ప్రైవేట్ బస్సు వెనకనుంచి వీరిని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో వైద్యుడు ఖుర్జేకర్, క్యాబ్ డ్రైవర్ జ్ఞానేశ్వర్ భోంస్లే (27)అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన మిగతా ఇద్దరు వైద్యులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలోఅసువులు బాసిన డాక్టర్ ఖుర్జేకర్ వృత్తిలో గోల్డ్ మెడలిస్ట్ కావడం విశేషం. అంతేగాక ఓ ఆసుపత్రిలో వెన్నెముక శస్త్రచికిత్స విభాగానికి అధిపతి. ఆయన సుమారు 3,500 క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం పేరుగాంచారు. -
అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం
ముంబై: ముంబై పుణే ఎక్స్ ప్రెస్ హైవేపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామ్సెట్ టన్నెల్ దగ్గర కారు బోల్తా కొట్టడవంతో అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. లోనావాలా కామ్సెట్ మార్గంలో వీరు ప్రయాణిస్తున్న కారు స్కిడ్ కావడంతో అయిదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది. -
వంతెనపై సెల్ఫీ తీసుకుంటూ..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో సెల్ఫీ మరణం సంభవించింది. ముంబై-పుణే రహదారిలో అమృతాంజన్ వంతెనపై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఈ సంఘటన బుధవారం లోనావాలాలో చోటుచేసుకుంది. నాసిక్‌లోని ఇంద్రప్రస్థ కాలనీ క్యాంప్‌కు చెందిన తనవేల్ అశోక్ కదమ్ (20) లోనావాలాలోని సింహఘడ్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి నాసిక్ నుంచి లోనావాలాకు కాలేజీకి వచ్చాడు. బుధవారం ఉదయం లోనావాలాలోని అమృతాంజన్ వంతెన వద్దకు వచ్చిన అశోక్.. అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వర్షాకాలంలో లోనావాలాలోని అందాలను తిలకించేందుకు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ముంబైలో ఘోర ప్రమాదం, 17 మంది మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముంబై-పుణె జాతీయ రహదారిపై ఓ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. రెండు కార్లను ఢీ కొన్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు, కార్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. సుమారు 20 అడుగుల పై నుంచి బస్సు కిందకు పడింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాలపై రాళ్ల వర్షం
పుణె: ప్రసిద్ధ ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిపై వెళుతున్న వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్ల వాన కురిసింది. రహదారిలోని అదోషి టన్నెల్ వద్ద ఆదివారం మద్యాహ్నం కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా బండరాళ్లు కూలి ఓ కారు, మరో రెండు వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మరణించినట్లు తెలిసింది. చిత్రంలో కినిపిస్తున్న కారుపై పెద్ద బండరాళ్లు నేరుగా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రహదారిపై రాళ్లు గుట్టలా పేరుకుపోవడంతో ఇరువైపులా భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యంత్రాలతో రాళ్లను తొలిగిస్తున్న పోలీసులు మరికొద్ది గంటల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తామని చెప్పారు. ముంబై- పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఇలాంటివి ఐదారు టన్నెల్స్ ఉన్నాయి. దీంతో అధికారులు అన్నిచోట్ల ముందస్తు రక్షణచర్యలు చేపట్టారు. -
ట్రామాకేర్‌సెంటర్ మరో 6 నెలలు వాయిదా
సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఏర్పాటు చేసిన ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం మరో ఆరు నెలల పాటు వాయిదా పడింది. నిర్వహణ లోపం, ఎయిర్ ఆంబులెన్స్ పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకెళితే 94 కి.మీ మేర ఉన్న ముంబై-పుణే ైెహ వేలో ప్రమాదం జరిగినపుడు బాధితులను ఆస్పత్రికి తరలించేలోపు మృత్యువాత పడుతున్నారు. దీంతో ఈ మార్గంపై నాలుగు ట్రామా కేంద్రాల్ని ఏర్పాటు చేసి తగు పరికరాలతో ఎయిర్ ఆంబులెన్ ్స సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పెలైట్ ప్రాజెక్టుగా తెలంగాణ టోల్ ప్లాజా వద్ద ఒజార్డే గ్రామంలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించడం కోసం ఈ ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం ఎమ్మెస్సార్డీసీ రూ. 4 కోట్లు ఖర్చు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు 2013లో ప్రారంభమవగా, గతేడాది నవంబర్‌లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అనుభవం కలిగిన కంపెనీలు సెంటర్‌ను నిర్వహించాల్సిందిగా ఎమ్మెస్సార్డీసీ కోరగా, పుణేలోని లోక్మాన్య ఆస్పత్రి సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. రోగులను ఆస్పత్రికి చేర్చే అంశం, ఇంధన ఖర్చు చెల్లింపు విషయంలోనూ పలు సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్ కావాలనుకున్న రోగులు మాత్రమే ఈ ఖర్చులు భరిస్తారని ఎమ్మెస్సార్డీసీ తేల్చి చెప్పింది. 2006 నుంచి 2014 వరకు ఈ మార్గంపై జరిగిన ప్రమాదాల్లో 925 మంది మరణించగా, 2,473 మందికి గాయాలయ్యాయి.