సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఏర్పాటు చేసిన ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం మరో ఆరు నెలల పాటు వాయిదా పడింది. నిర్వహణ లోపం, ఎయిర్ ఆంబులెన్స్ పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకెళితే 94 కి.మీ మేర ఉన్న ముంబై-పుణే ైెహ వేలో ప్రమాదం జరిగినపుడు బాధితులను ఆస్పత్రికి తరలించేలోపు మృత్యువాత పడుతున్నారు.
దీంతో ఈ మార్గంపై నాలుగు ట్రామా కేంద్రాల్ని ఏర్పాటు చేసి తగు పరికరాలతో ఎయిర్ ఆంబులెన్ ్స సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పెలైట్ ప్రాజెక్టుగా తెలంగాణ టోల్ ప్లాజా వద్ద ఒజార్డే గ్రామంలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించడం కోసం ఈ ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం ఎమ్మెస్సార్డీసీ రూ. 4 కోట్లు ఖర్చు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు 2013లో ప్రారంభమవగా, గతేడాది నవంబర్‌లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
అనుభవం కలిగిన కంపెనీలు సెంటర్‌ను నిర్వహించాల్సిందిగా ఎమ్మెస్సార్డీసీ కోరగా, పుణేలోని లోక్‌మాన్య ఆస్పత్రి సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. రోగులను ఆస్పత్రికి చేర్చే అంశం, ఇంధన ఖర్చు చెల్లింపు విషయంలోనూ పలు సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్ కావాలనుకున్న రోగులు మాత్రమే ఈ ఖర్చులు భరిస్తారని ఎమ్మెస్సార్డీసీ తేల్చి చెప్పింది. 2006 నుంచి 2014 వరకు ఈ మార్గంపై జరిగిన ప్రమాదాల్లో 925 మంది మరణించగా, 2,473 మందికి గాయాలయ్యాయి.
ట్రామాకేర్‌సెంటర్ మరో 6 నెలలు వాయిదా
Published Mon, Mar 2 2015 11:12 PM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement