ముంబైలో ఘోర ప్రమాదం, 17 మంది మృతి | bus fell into deep ditch on Mumbai-Pune Expressway, 17 died | Sakshi
Sakshi News home page

ముంబైలో ఘోర ప్రమాదం, 17 మంది మృతి

Published Sun, Jun 5 2016 8:08 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

bus fell into deep ditch on Mumbai-Pune Expressway, 17 died

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముంబై-పుణె జాతీయ రహదారిపై ఓ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. రెండు కార్లను ఢీ కొన్న బస్సు లోయలో పడింది.

ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు, కార్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. సుమారు 20 అడుగుల పై నుంచి బస్సు కిందకు పడింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement