వంతెనపై సెల్ఫీ తీసుకుంటూ.. | College Youth DIES while Clicking Selfie at Amrutanjan Bridge | Sakshi
Sakshi News home page

వంతెనపై సెల్ఫీ తీసుకుంటూ..

Published Thu, Jun 23 2016 1:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

College Youth DIES while Clicking Selfie at Amrutanjan Bridge

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో సెల్ఫీ మరణం సంభవించింది. ముంబై-పుణే రహదారిలో అమృతాంజన్ వంతెనపై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఈ సంఘటన బుధవారం లోనావాలాలో చోటుచేసుకుంది. నాసిక్‌లోని ఇంద్రప్రస్థ కాలనీ క్యాంప్‌కు చెందిన తనవేల్ అశోక్ కదమ్ (20) లోనావాలాలోని సింహఘడ్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

మంగళవారం రాత్రి నాసిక్ నుంచి లోనావాలాకు కాలేజీకి వచ్చాడు. బుధవారం ఉదయం లోనావాలాలోని అమృతాంజన్ వంతెన వద్దకు వచ్చిన అశోక్.. అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా,  వర్షాకాలంలో లోనావాలాలోని అందాలను తిలకించేందుకు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement