సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.
రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.
కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment