కృష్ణాజిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు కాలేజీ విద్యార్థుల ప్రాణం తీసింది.
లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్ధులు వారంతం సెలవు కావడంతో స్నానం చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువులోకి దిగారు. అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో జారి నీటిలో పడిపోయారు. ఈత వచ్చినా.. నీటి ఉద్ధృతికి ఈదలేక కొట్టుకుపోయారు. అయినప్పటికీ ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు రాగా.. ఇద్దరు విద్యార్థులు పాలడుగు దుర్గారావు , జె.వెంకటేష్‌లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారులు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment