140 కోట్ల భారతీయులున్న దేశానికి ఆర్థిక మంత్రి. 3937 బిలియన్ డాలర్ల మూలధన లెక్కలను చూసే నాయకురాలు ఢిల్లీ మెట్రో ఎక్కి ప్రయాణం చేస్తే ఆశ్చర్యపోరా మరి.!
అవును కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధాసీదా ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రో రైలులో లక్ష్మీ నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
అయితే నిర్మలా సీతారామన్ మెట్రో ట్రైన్‌లో ప్రయాణించడంపై మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం 2024 లోక్ సభ ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు.
ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణిస్తున్న వీడియోపై నెటిజన్లు ఇలా స్పందించారు ‘పన్ను సంబంధిత ప్రశ్న అడగాలి’ అని ఒక యూజర్ అంటుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాను ఎంచుకుని, తోటి ప్రయాణికులతో మమేకమవడం సంతోషంగా ఉంది. సహచరులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు.
మరో యూజర్ మాత్రం.. నిర్మలా సీతారామన్ మెట్రో ప్రయాణం ఎన్నికల స్టంట్. ఎందుకంటే.. అధికారంలో ఉన్న 10ఏళ్లలో ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించారా? సాధారణ ప్రయాణికులతో ఎప్పుడైనా ముచ్చటించారా అని వ్యాఖ్యానించారు.
Smt @nsitharaman travels in Delhi Metro to Laxmi Nagar and interacts with fellow commuters. pic.twitter.com/HYSq3oUiAo
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 17, 2024
Comments
Please login to add a commentAdd a comment