కలకలం రేపిన ఎయిర్ ఇండియా విమానం | Air India flight diverted due to technical snag | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన ఎయిర్ ఇండియా విమానం

Published Sun, Nov 6 2016 4:00 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

కలకలం రేపిన ఎయిర్ ఇండియా విమానం - Sakshi

కలకలం రేపిన ఎయిర్ ఇండియా విమానం

జైపూర్: విజయవాడ-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కలకలం రేగింది. ఢిల్లీ విమానాశ్రయంలో కిందకు దిగకుండా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. చివరకు విమానాన్ని జైపూర్ మళ్లించారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఎయిర్ ఇండియా నిపుణులు రంగంలోకి దిగారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement