నిలిచిపోయిన న్యూయార్క్‌ విమానం | Air India's Delhi-New York flight grounded | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన న్యూయార్క్‌ విమానం

Published Thu, Apr 20 2017 8:57 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

Air India's Delhi-New York flight grounded

న్యూఢిల్లీ: ఇంజన్‌లో హైడ్రాలిక్‌ వైఫల్యం నెలకొనడంతో న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం బుధవారం నిలిచిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 300 మంది ప్రయాణికులకు సమీప హోటల్లో బస కల్పించామని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు.

మంగళవారం రాత్రి 1.40 గంటలకు న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా 101 విమానంలో ఈ సమస్య తలెత్తింది. ప్రయాణికులను తీసుకెళ్లడానికి మరో విమానాన్ని సిద్ధం చేయాలని ఎయిరిండియా చేసిన యత్నాలు సఫలం కాలేదు. సమస్యను పరిష్కరించడానికి ఇంజినీర్లు కృషిచేస్తున్నారని, బుధవారం సాయంత్రం 5 గంటలకు విమానం బయల్దేరే అవకాశముందని ఎయిరిండియా అధికారి వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement