
ఏఐ విమానంలో సాంకేతిక లోపం
జైపూర్: ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం రాజస్థాన్ లోని జైపూర్ లో అత్యవసరంగా కిందకు దిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే విమానం కిందకు దిగిందని అనుమానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఎయిర్ బస్ 321 విమానంలో 103 మంది ప్రయాణికులున్నారు.
విమానం ఈ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. దీంట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ నుంచి రప్పించిన మరో విమానంలో ప్రయాణికులను ఉదయం 9 గంటలకు అహ్మదాబాద్ తరలించారు.