Plastic Money
-
ఫోన్‌తో క్యాష్‌లెస్ లావాదేవీలు ఇలా..
-
డిజిటల్ మనీతో జాగ్రత్తలు ఇవీ..
నగదు రహిత లావాదేవీలతో లాభాలు ఎన్ని ఉన్నా.. సైబర్ ప్రపంచం తీరుతెన్నులపై అవగాహన లేకుంటే మాత్రం నష్టపోక తప్పదు. అందుకే నగదు రహిత లావాదేవీలు జరిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ► క్రెడిట్, డెబిట్ కార్డుల పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్)ను గోప్యంగా ఉంచుకోవాలి. దానిని తరచుగా మార్చుకుంటూ ఉండాలి. ► నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంటిపేర్లను పాస్‌వర్డ్‌లుగా వాడుతూంటారు. అలా కాకుండా.. ప్రతి పాస్‌వర్డ్‌లో కొన్ని అక్షరాలు, ఒకట్రెండు అంకెలు, ప్రత్యేక సంకేతాలు ఉండేలా రూపొందించుకోవాలి. పాస్వర్డ్ ఎనిమిది అక్షరాలకు తక్కువ కాకుండా ఉంటే మంచిది. ► వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు వాడాలి. వాటిని ఎక్కడైనా రాసిపెట్టుకోవడం కూడా మంచిది కాదు. బదులుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండే పాస్వర్డ్ మేనేజర్లను వాడటం మేలు. వీటిలో మీ యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లను నిక్షిప్తం చేసినా.. అవి ఎన్‌స్క్రిప్ట్ అవుతారుు కాబట్టి ఇతరులు తెలుసుకునే అవకాశం తక్కువ. ► ఇటీవల చాలా చోట్ల ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అలాంటి బహిరంగ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలను చేయకపోవడమే మేలు. ► స్మార్ట్ఫోన్లలో అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ నుంచి కొన్ని వివరాలు తీసుకునేందుకు అప్లికేషన్ తయారీదారులు అనుమతులు కోరతారు. ఏయే వివరాలు కోరుతున్నారో గమనించడం అవసరం. ► స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లలో లేటెస్ట్ యాంటీ వైరస్, మాల్వేర్, స్పైవేర్ సాఫ్ట్వేర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ► మీకు పరిచయం లేని వ్యక్తుల నుంచి ప్రలోభాలు ఎర చూపుతూ వచ్చే మెయిళ్లను, అటాచ్మెంట్లను ఓపెన్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ► ఏ బ్యాంకు, ఆర్థిక సంస్థ మెయిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా మీ వివరాలు కోరదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తే సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
క్యాష్‌లెస్ లావాదేవీలు ఇలా..
మొబైల్ వాలెట్లు జేబులో ఉన్న పర్సు మొబైల్ ఫోన్లోకి మారితే దాన్ని మొబైల్ వ్యాలెట్ అనవచ్చు. సొమ్మును బ్యాంకు ఖాతా నుంచి డిజిటల్ రూపంలో మొబైల్ అప్లికేషన్లోకి బదలారుుంచుకుని వాడుకునేందుకు వీలు కల్పించే సౌకర్యం ఇది. క్రెడిట్ కార్డులతో కూడా మొబైల్ వాలెట్లలో డిజిటల్ నగదు చేర్చుకోవచ్చు. పేటీఎం, ఫ్రీచార్జ్, మొబీక్విక్ వంటివి మొబైల్ వ్యాలెట్లలో కొన్ని. మీరు ఉపయోగించే మొబైల్ వ్యాలెట్ ఆధారంగా మీకు అందే సేవలు ఉంటారుు. ప్లాస్టిక్ మనీ క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలను ప్లాస్టిక్ నగదు లావాదేవీలుగా పరిగణిస్తారు. బ్యాంకులు, కొన్ని ఇతర సంస్థలు ఈ కార్డులు జారీ చేస్తారుు. ఆన్‌లైన్‌లోనూ వీటిని తీసుకోవచ్చు, రీచార్జ్ చేసుకో వచ్చు కూడా. పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) యంత్రాలు ఉన్న చోట్ల వీటిని స్వైప్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ మొబైల్ వ్యాలెట్ల అవసరం లేకుండా నేరుగా ఇంటర్నెట్లో ఆయా బ్యాంకు ఖాతాల ద్వారా అన్ని రకాల సేవలు పొందేందుకు వీలు కల్పించేది నెట్ బ్యాంకింగ్. కంప్యూటర్ల ద్వారా, స్మార్ట్ఫోన్ల ద్వారా కూడా నెట్ బ్యాంకింగ్ నిర్వహించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు (సొంత ఖాతా లేదా ఇతరుల ఖాతా దేనికై నా సరే) నగదు బదిలీ చేయవచ్చు. ఇందుకు మూ డు పద్ధతులున్నారుు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స ట్రాన్సఫర్ (నెఫ్ట్ - అధిక మొత్తాల బది లీకి) వీటిల్లో ఒకటి. రెండోది రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్ - తక్కువ మొత్తాల బదిలీకి), మూడోది ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్ - తక్షణ బదిలీ కోసం). ఈ మూడు పద్ధతుల ద్వారా నగదు బదలారుుంపులకు అయ్యే ఖర్చు ఐదు రూపాయల నుంచి రూ. 55 వరకూ ఉంటుంది. -
అక్కడ పెద్ద నోట్లు, ఇంటర్నెట్ సేవలు రెండూ బంద్!
ఓ వైపు పెద్ద నోట్ల రద్దు.. మరోవైపు ఇంటర్నెట్ సేవలు బంద్. మరి ప్రజలు పరిస్థితేమిటి? ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలివే. సాధారణ ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఇదే పరిస్థితిని చవిచూస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా లాల్ చౌక్‌లో ఓ దుకాణంలో అప్పు చేసి మరీ తనకు కావాల్సిన సరుకులు కొనుకున్నారట. 500, 1000 నోట్ల రద్దుతో పాటు, మరోవైపు మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా కశ్మీర్ వ్యాలీలో నిలిచి ఉండటంతో ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఉన్న ఏటీఎంలు కూడా అవుట్ ఆఫ్ సర్వీసు అనే బోర్డులను వేలాడదీస్తూ ఉండటంతో, ప్రజల కనీస అవసరాలకు నగదు కరువవుతోంది. కశ్మీర్ వ్యాలీలో ఇంటర్నెట్ సేవలు జూలై 8 నుంచి నిలిచిపోయిన సంగతి విదితమే. హిజ్బుల్ మెహిద్దీన్ మిలిటెండ్ బుర్హాన్ వానీ ఎన్కౌంటర్లో మరణించడంతో రగిలిన నిరసనలు, ఘర్షణలతో అక్కడ ఇంటర్నెట్, మొబైల్ సేవలను బంద్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ల్యాండ్ లైన్ ఇంటర్నెట్ కనెక్షన్లను పునరుద్ధించినప్పటికీ, అక్కడ 6వేల కంటే తక్కువగానే బ్రాండ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లే ఉన్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలవడంతో, జమ్మూకశ్మీర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సిమ్ కార్డుల ద్వారా అందిస్తున్న పీఓఎస్ మిషన్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుగడం లేదు. లాల్ చౌక్, రెసిడెన్సీ రోడ్‌లోని శ్రీనగర్ బిజినెస్ హబ్‌లో కేవలం ఒకే ఒక్క డిపార్ట్మెంటల్ స్టోర్ డెబిట్, క్రెడిట్ కార్డులను అనుమతిస్తోంది. వ్యాలీలోని 100కు పైగా పెట్రోల్ పంప్స్‌లో కూడా ఒకే పెట్రోల్ పంప్లో బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. చాలామంది ప్రజల దగ్గర డెబిట్ కార్డులు ఉన్నప్పటికీ, కనీసం అవి పనికిరాకుండా మారాయని అసహనం వ్యక్తంచేస్తున్నారు. పాలు, కూరగాయాలు వంటి కనీస అవసరాలకు తమకు నగదు కావాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు. ప్రజల అభ్యర్థనలు సహేతుకమైనవిగా భావించిన, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను కీలకంగా తీసుకున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి, విద్యామంత్రి నయీమ్ అక్తర్ తెలిపారు. ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు. -
ప్లాస్టిక్ మనీతో నల్లధనానికి చెక్!
పరిధి దాటే నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరి న్యూఢిల్లీ: దేశంలో నల్లధనం చలామణిని అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నిర్ణీత స్థాయి దాటి సాగే నగదు లావాదేవీలపై పాన్‌కార్డు వివరాల సమర్పణను త్వరలో తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఫేస్బుక్ ద్వారా ఆదివారం నెటిజన్లతో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. భారతీయుల నల్లధనంలో అత్యధికం దేశంలోనే ఉందన్న జైట్లీ... ప్లాస్టిక్ కరెన్సీ వాడకాన్ని ప్రామాణికం చేసి అసాధారణ పరిస్థితుల్లోనే నగదు వాడకం జరిగేలా ప్రజల వైఖరిలో మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మార్పును ఆచరణలోకి తెచ్చేందుకు వివిధ ప్రాధికార సంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు వివరించారు. అధిక సంఖ్యలో పేమెంట్ గేట్‌వేల ప్రారంభం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా ప్లాస్టిక్ మనీ వాడకం ఎక్కువగా పెరుగుతుందన్నారు. 18 కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదారులకు రూపే కార్డుల జారీ, బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీ, ముద్రా పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ముద్రా క్రెడిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచే రుణాల విత్‌డ్రాయల్ మొదలైనవి ఈ కోవలోకే వస్తాయన్నారు. విదేశాల్లో దాచిన నల్లధనం వివరాలను సెప్టెంబర్ 30తో ముగిసిన గడువులోగా ప్రకటించి పన్ను, జరిమానా చెల్లించే అవకాశాన్ని వినియోగించుకోని నల్లకుబేరులపై కఠిన చర్యలు తీసుకుంటామని జైట్లీ హెచ్చరించారు. డిసెంబర్లో జాబితా ప్రకటించనున్న స్విస్ జూరిక్: తమ దేశంలోని బ్యాంకుల్లో 1955 నుంచి క్రియారహితంగా ఉన్న భారతీయ ఖాతాదారుల తొలి జాబితాను స్విట్జర్లాండ్ డిసెంబర్లో ప్రచురించనుంది. నాటి ఖాతాదారులను సంప్రదించేందుకు బ్యాంకులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో స్విస్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టనుంది.