రైలు టికెట్లు ఇక సెల్‌ఫోన్లో కొనొచ్చు | Now, can be bought railway tickets in Cellphone | Sakshi
Sakshi News home page

రైలు టికెట్లు ఇక సెల్‌ఫోన్లో కొనొచ్చు

Published Wed, Apr 22 2015 7:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

రైలు టికెట్లు ఇక సెల్‌ఫోన్లో కొనొచ్చు

రైలు టికెట్లు ఇక సెల్‌ఫోన్లో కొనొచ్చు

న్యూఢిల్లీ: రైలు టికెట్ కోసం ఇక గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. సెల్‌ఫోన్లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ టికెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణించవచ్చు. ఇందుకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్‌ను భారతీయ రైల్వే బుధవారం ప్రారంభించనుంది. రైల్వే శాఖ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాలు తెలిపారు.
 
 ఎలా పనిచేస్తుంది?
 ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు గూగుల్ యాప్ స్టోర్ నుంచి రైల్వే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రైల్వే ఈ-వాలెట్ సృష్టించడం కోసం యూజర్‌కు రిజిస్ట్రేషన్ ఐడీ నంబరు వస్తుంది. టికెట్ల కొనుగోలు సొమ్మును ఈ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్లో చెల్లించవచ్చు. లేదంటే, ఏ రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్లోనైనా చెల్లించవచ్చు. టికెట్లు తనిఖీ చేసే వారికి ఫోన్లోని సాఫ్ట్ కాపీ చూపితే చాలు.  ఏ రైల్వే స్టేషన్‌కైనా వెళ్లి ఈ-వాలెట్‌ను టాప్‌అప్ చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుతో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లోనూ టాప్‌అప్ చేయించుకోవచ్చు. అంతేకాదు, సీజన్ టికెట్లనూ రెన్యువల్ చేసుకోవచ్చు. ముంబై సబర్బన్ సెక్టార్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. విజయవంతం కావడంతో దేశమంతటా ప్రవేశపెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement