బ్లాక్‌బెర్రీ మొబైల్కు 16 పట్టణాల సమాచారం
న్యూఢిల్లీ: మరొకరి సాయం లేకుండా దేశవ్యాప్తంగా 16 పట్టణాలలో సొంతంగానే పర్యటించేందుకు ఉపకరించే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ సహకారంతో ‘ఇంక్రెడిబుల్ ఇండియా వాకింగ్ టూర్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ అప్లికేషన్‌లో హైదరాబాద్, చెన్నై, జైపూర్, గోవా, బెంగళూరు, ముంబై సహా 16 పట్టణాల సమాచారం ఉంటుందని పర్యాటక శాఖ వెల్లడించింది.
నిపుణుల బందం ఈ సమాచారాన్ని పొందుపరిచిందని, ఈ అప్లికేషన్ ద్వారా పట్టణాల్లోని వీధులను 360 డిగ్రీల కోణంలో ఆమూలాగ్రం చూడవచ్చని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది బ్లాక్‌బెర్రీ మొబైల్స్ కోసమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు.