బెంగళూరు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేంద్ర రక్షణ, ఆయూష్ శాఖ సహాయమంత్రి శ్రీపాదనాయక్ కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి భార్య విజయ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీపాదనాయక్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆయన్ను గోవాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఎల్లాపూర్ నుంచి గోవర్ణ వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గోవా సీఎంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి తక్షణమే అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment