గోవాలో 11మంది పర్యాటకుల అరెస్ట్‌ | Pune Tourists Arrested For Molesting Two Minor In Baga Beach | Sakshi
Sakshi News home page

గోవాలో 11మంది పర్యాటకుల అరెస్ట్‌

Published Wed, May 30 2018 5:02 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

Pune Tourists Arrested For Molesting Two Minor In Baga Beach - Sakshi

పణాజి : గోవా పోలీసులు బుధవారం 11 మంది పర్యాటకులను అరెస్ట్‌ చేశారు. నార్త్‌ గోవాలోని బాగా బీచ్‌లో మైనర్‌పై వేధింపులకు పాల్పడినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఓ కుటుంబం మంగళవారం బాగా బీచ్‌కు వెళ్లింది. తల్లిదండ్రులు ఫుడ్‌ స్టాల్‌కు వెళ్లగా అన్నాచెల్లలు ఇద్దరు బీచ్‌లోనే కూర్చున్నారు.

అటుగా వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను ఫొటోలను తీయడం ప్రారంభించారు. దీనిని ప్రశ్నించిన బాలిక సోదరుడిపై దాడికి దిగారు. అంతేకాకుండా బాలికపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు కలన్‌గుటే పోలీసులును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన పోలీసులు పర్యాటకులు రాష్ట్రం దాటి వెళ్లకముందే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రలోని పూణెకు చెందిన వారిగా గుర్తించారు. అరెస్ట్‌ అయిన 11 మందిలో ఇద్దరు మైనర్లు ఉండటంతో వారిని ప్రొటెక్షన్‌ హోంకు తరలించినట్టు పోలీసు అధికారి డాల్వి తెలిపారు. ఆ మైనర్‌ ఫొటోలను తీయడానికి వినియోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement