
సాక్షి, అమరావతి : పంటల సేకరణ విధానాల్లో లోపాలు ఉంటే క్షుణ్ణంగా అధ్యయనం చేసి సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్‌పై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం పరిస్థితులపై ప్రతి రోజు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. ‘కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్’ యాప్‌పై జాయింట్ కలెక్టర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు అధికారులు యాప్‌లో మార్పులు చేశారు. ఈ కొత్త యాప్ వివరాలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. యాప్ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. (జర్నలిస్ట్‌లకు అండగా సీఎం జగన్ )
మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో పంట సేకరణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలను ఒక జేసీకి అప్పగించాలని, జేసీలందరికీ ఈ యాప్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (‘బాబు డబ్బులు ఇచ్చి మరీ లైన్‌లోకి పంపుతున్నారు’ )
Comments
Please login to add a commentAdd a comment