ఒత్తిడిని తరిమేసే ‘స్ట్రెస్‌బస్టర్స్’ యాప్!
వాషింగ్టన్: పరీక్షల కోసం రేయింబవళ్లు చదువుతూ.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా? ఇతరులతో సంబంధాలు దెబ్బతినడం లేదా పని ఒత్తిడి, సమస్యల వల్ల కుంగుబాటుకు లోనవుతున్నారా? అయితే మీ లాంటివారి ఒత్తిడిని, ఆందోళనను తరిమేసేందుకు ఉపయోగపడే ‘స్ట్రెస్‌బస్టర్స్’ అనే ఓ మొబైల్ అప్లికేషన్‌ను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ పరిశోధకులు రూపొందించారు.
అమెరికా, ఇతర పలు దేశాల యూనివర్సిటీల విద్యార్థులు ఉపయోగిస్తున్న ఈ ‘స్ట్రెస్‌బస్టర్స్’ యాప్‌తో ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడేలా న్యూస్ అలర్ట్స్, స్ఫూర్తిదాయకమైన మాటలు, వీడియోలు పరస్పరం అందుకోవచ్చు. ఒకే ఒక్క బటన్‌ను నొక్కి నేరుగా ఇతరులకు రిప్లై ఇవ్వవచ్చు. విద్యార్థులకు బాగా ఉపయోగపడే ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్‌లపై పనిచేస్తుంది. ఆపిల్ కంపెనీ యాప్ స్టోర్, గూగుల్ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.