beta version
-
వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తు న్నారు. తాము వాడే యాప్‌లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా సరదా ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో ఫొటోలు, ఇమేజ్‌లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో అందుబుటులోకి వచ్చే అవకాశ ముంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వొచ్చని ‘వెబ్బేటాఇన్ఫో’ తన కథనంలో పేర్కొంది. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యాప్‌లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు.. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అంబుబాటులోకి వస్తే ఇమేజ్ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.7.13 వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్‌ను అందుబాటులోకి తేవచ్చు. బేటా ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన టెస్టర్లనే తొలుత దీనిని వాడేందుకు అనుమతిస్తారు. సెర్చ్ బార్లో టైప్‌చేసి నేరుగా ఏఐ సర్వీస్‌తోనే చాటింగ్ చేసి కావాల్సిన ఫలితాలు పొందే ఫీచర్‌పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్ వచ్చే సందేశాలనూ ఓపెన్ చేయకుండానే టెక్ట్స్ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్‌ను యూజర్లకు అందివ్వాలని వాట్సాప్ భావిస్తోంది. -
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. గూగుల్ మీట్ తరహాలో
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీడియో కాల్స్ చేసే సమయంలో యూజర్లు వినియోగార్ధం స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ తరహాలో వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ సైతం అదే తరహాలో ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్ తెచ్చేందుకు నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలో అందరికి పూర్తిస్థాయిలో వినియోగించేలా విడుదల కానుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఇక, స్క్రీన్ ఫీచర్ ముఖ్య ఉద్దేశం..యూజర్లు వీడియో కాల్ మాట్లాడే సమయంలో అదే కాల్‌ను ఇతరులకు షేర్ చేసేలా డెవెలప్ చేస్తోంది. స్క్రీన్ కింద కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్ అందిస్తున్నది. ఈ బటన్ క్లిక్ చేస్తే సరి.. మీ ఫోన్ లో చేసేది ప్రతిదీ రికార్డు అవుతుంది. అవతలి వ్యక్తికి కూడా షేర్ అవుతుంది. అయితే ఇలా వీడియో కాలింగ్ రికార్డు చేయడానికి యూజర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. -
యాపిల్ డివైజ్‌లకు 5జీ అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ పరికరాలు 5జీని సపోర్ట్ చేసేలా ప్రయోగాత్మకంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశీ టెలికం సంస్థల నుంచి 5జీ నెట్‌వర్క్‌కు యాక్సెస్ లభించిన యూజర్లు .. ఐఫోన్ల ద్వారా సదరు సర్వీసులను పొందడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఈ బీటా ప్రోగ్రాం కోసం యూజర్లు యాపిల్ వెబ్సైట్లో నమోదు చేసుకుని, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్ 12 అంతకు మించిన వెర్షన్లకు ఇది పని చేస్తుంది. టెలికం సంస్థ జియో ప్రస్తుతం తాము 5జీ సర్వీసులు అందిస్తున్న నగరాల్లో యూజర్లకు జియో వెల్కమ్ ఆఫర్ పేరిట ప్రత్యేక ఆహ్వానాలు పంపుతోంది. వారికి ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత 5జీ డేటా అందిస్తోంది. అయితే, ఇందుకోసం ప్రీపెయిడ్ కస్టమర్లు రూ. 239 అంతకు మించిన ప్లాన్ ఉపయోగిస్తుండాలి. పోస్ట్ పెయిడ్ యూజర్లు అందరూ ఈ ఆఫర్‌కు అర్హులే. మరోవైపు, ఎయిర్టెల్ మాత్రం ఇటువంటి ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం లేదు. తాజా యాపిల్ బీటా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకున్నాక యూజర్లు తమ ప్రస్తుత ప్లాన్‌లో భాగంగానే 5జీ సర్వీసులను ట్రయల్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు. -
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయంలో వేగంగా చెకిన్..
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆధారిత ‘డిజి యాత్రా’ బీటా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ బెంగళూరు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభమైంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు విమానాశ్రయంలోకి వేగంగా చెకిన్ కావచ్చని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది.ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత 20వేల మంది ప్రయాణికులు మొదటి రోజు అవాంతరాల్లేని, సురక్షిత ప్రయాణ అనుభవాన్ని చూసినట్టు తెలిపింది. బయోమెట్రిక్, ఇతర కీలక వివరాలను ప్రయాణికులు మూడో నంబర్ టెర్మినల్ వద్ద సమర్పించిట్టు ప్రకటన విడుదలైంది. ఈ యాప్‌నకు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లోని పలు తనిఖీలను మానవ ప్రమేయం లేకుండా, డీజిటల్‌గా పూర్తి చేసుకోవడం సాధ్యపడుతుంది. డిజి యాత్రా బీటా వెర్షన్‌ను పరీక్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలనే ఎంపిక చేశారు. విస్తృత పరిశీలన తర్వాత అన్ని విమానాశ్రయాల్లో దీన్ని ప్రవేశపెడతారు. -
పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..
ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి, ఒక గ్రూపులో పెట్టాల్సిన పోస్ట్ మరో గ్రూపులో.. వేయడం చాలామందికి జరిగేదే!. పరధ్యానంలో, కంగారులో చేసే ఈ పొరపాటు.. ఒక్కోసారి విపరీతాలకు సైతం దారితీస్తుంటాయి. ఇదే విధంగా చాలా మంది వాట్సాప్‌లో ఏమరుపాటులో స్టేటస్లు కూడా అప్డేట్ చేస్తుంటారు. అయితే ఇటువంటి సమయాల్లో పనికొచ్చే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది. వాట్సాప్ ఈమధ్య మల్టీ డివైస్ సపోర్ట్, గ్రూప్స్ కాల్స్ నడుస్తుండగా.. జాయిన్ కాగలిగే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ తీసుకొస్తోంది వాట్సాప్. స్టేటస్ విషయంలో ‘అండూ బటన్’ను తేనుంది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా యాక్సిడెంటల్‌గా ఏదైనా స్టేటస్లు అప్డేట్ చేస్తే.. వెంటనే దానిని తొలగించొచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ స్టేటస్ పొరపాటున పెడితే.. డిలీట్ చేయాలంటే కొంత టైం పడుతుంది. స్టేటస్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే వచ్చే మూడు చుక్కల మెనూ మీద క్లిక్ చేశాకే డిలీట్ ఆప్షన్‌ను క్లిక్ చేసి చేయొచ్చు. కానీ, అండూ బటన్ ఫీచర్ వల్ల ఆ టైం మరింత తగ్గిపోనుంది. పొరపాటున మాత్రమే కాదు.. ఎక్కువ గ్యాలరీ కంటెంట్(వాట్సాప్ స్టోరీస్)తో వాట్సాప్ స్టేటస్లు పెట్టే వాళ్లకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోందని, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే క్షణంలో ఆ స్టేటస్‌ను తొలగించే వీలు ఉంటుందని ‘వాబేటాఇన్ఫో’ కథనం ప్రచురించింది. తద్వారా యాక్సిడెంటల్‌గా పోస్ట్ చేసినా.. అవతలివాళ్లు స్క్రీన్ షాట్ తీసేలోపే ఆ స్టేటస్‌ను తొలగించొచ్చు. ముందు ఐవోఎస్ వెర్షన్లో ఆతర్వాతే ఆండడ్రాయిడ్ వెర్షన్‌కు ఈ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. చదవండి: నెలలో 20 లక్షల మంది వాట్సాప్ అకౌంట్ల బ్యాన్! కారణం ఏంటంటే.. -
Whatsapp : వీడియో ఫీచర్స్‌లో మార్పులు.. అవేంటంటే !
యూజర్ ఫ్రెండ్లీగా ఉండే సరికొత్త ఫీచర్లను అందుబాటులో తెచ్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. వాట్సప్ యూజర్లకు సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా నూతన ఫీచర్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వీడియో, చాట్ కంటెంట్ విషయంలో ఈ మార్పులు ఉండబోతున్నాయి. వీడియో క్వాలిటీ ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ ఎప్పుడో పాతపడిపోయింది. ఇప్పుడు 4కే, 8కే రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ ట్రెండ్‌గా మారింది. అయితే 4కే , 8కే వీడియోలు ఎక్కువ మోమోరినీ ఆక్రమిస్తాయి. వీటిని ఇతరులకు సెండ్ చేసేప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరోవైపు వీడియో డౌన్లోడ్లతో ఫోన్లలో మోమరీ సైతం త్వరగా అయిపోతుంది. ఈ రెండు సమస్యల పరిష్కారానికి వీడియో క్వాలిటీ షేరింగ్‌లో వాట్సప్ మార్పులు చేసింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో టెస్ట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి వాట్సప్ తేనుంది. కొత్త మార్పులు ఇలా వాట్సప్ తాజా అప్డేట్ అయిన వీడియో షేరింగ్ క్వాలిటీకి సంబంధించి మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఆటో వెర్షన్ ఆప్షన్ , వాట్సప్ సైతం దీన్నే రికమండ్ చేయనుంది. బెస్ట్ క్వాలిటీ వీడియో, డేటా సేవ్‌లు మరో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఆటో వెర్షన్‌ని ఎంచుకుంటే సెండ్ చేసే వీడియోకు సంబంధించి బెస్ట్ ఆల్గోరిథమ్ని ఎంచుకుని దాని ప్రకారం వీడియోను వాట్సప్ సెండ్ చేస్తుంది. ఇక డేటా సేవ్ ఆప్షన్ ఎంచుకుంటే... వీడియోను కంప్రెస్ చేసి పంపిస్తుంది. మూడవది బెస్ట్ క్వాలిటీ వీడియోస్‌ని పంపే వెసులుబాటు కల్పిస్తుంది. చూశాక.. మాయం స్నాప్ చాట్ తరహాలోనే నిర్ణీత సమయం తర్వాత మేసేజ్, ఫోటోలు, వీడియోలు తదితర కంటెంట్ ఆటోమేటిక్ డిసప్పియర్ అయ్యేలా ఆప్షన్‌ను ప్రవేశపెట్టే పనిలో వాట్సప్ ఉంది. వాట్సప్‌లో వచ్చిన కంటెంట్‌ను ఒకసారి చూసిన తర్వాత కొంత సమయానికి ఆ కంటెంట్ కనిపించకుండా పోతుంది. బిజినెస్ రిలేటెడ్ చాట్స్‌కి ఆ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాట్సప్ అంటోంది. దీనికి సంబంధించి బీటా వెర్షన్ సైతం టెస్టింగ్‌లో ఉంది. -
వాట్సాప్ కొత్త ఫీచర్ : భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో మరో బ్రహ్మాండమైన సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను అందించబోతోంది. ముఖ్యంగా ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు రిసీవ్ చేసుకుంటూ.. విసిగెత్తిపోతున్న వాట్సాప్ యూజర్లకు(ఇష్టం లేకపోతే ఆయా గ్రూపులనుండి బయటకు వచ్చే అవకాశం ఉన్నా) ఇది నిజంగా మంచి ఊరట నిచ్చే ఫీచరే. ఎందుకంటే ఏదైనా గ్రూపులో చేరాలా వద్దా? అనేది ఇకపై వాట్సాప్ వినియోగదారుల చేతుల్లోనే ఉండబోతోంది. ఎవరు బడితే వారు, గ్రూపుల్లో యాడ్ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్ మూడు ఆప్షన్లను తీసుకురాబోతోంది. వాబేటా ఇన్ఫో.కాం అందించిన సమాచారం ప్రకారం ఇన్విటేషన్ ఫీచర్‌ను జోడించనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్ బిజెనెస్‌లో అమలు చేస్తుండగా..అదనపు భద్రత కోసం వాట్సాప్‌లో కూడా తీసుకు రాబోతోంది. తమను గ్రూప్స్‌లో ఎవరు జోడించవచ్చో స్వయంగా యూజర్లే ఎంచుకోవడానికి అనుమతించే ఫీచర్ అన్నమాట. దీని ప్రకారం ప్రైవసీ సెటింగ్స్‌లో మూడు ఆప్లన్లు ఉంటాయి. 1. నోబడీ : ఎవరికీ మిమ్మల్ని గ్రూపులో జోడించే అవకాశం ఉండదు 2. మై కాంటాక్ట్స్ : కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యూజర్‌ను గ్రూపులో యాడ్ చేసేందుకు అనుమతినివ్వడం 3. ఎవ్రీవన్ : అంటే యూజర్ పరిచయం లేకపోయినా, కాంటాక్ట్స్‌లో లేకపోయినా గ్రూపులో యాడ్ చేసేలా అనుమతినివ్వడం. ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ బీటాకి పరిచయం మవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం టెస్ట్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది, ఆసక్తి వున్నవారు దాన్ని ప్రయత్నించవచ్చట. అయితే బగ్స్ ఎటాక్, క్రాష్‌లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే, ఈలింక్పై క్లిక్ చేసి టెస్టింగ్ ప్రోగ్రాం నుంచి వైదొలగవచ్చని వాబేటా అందించిన రిపోర్టులో నివేదించింది. -
వాట్సాప్ నుంచి మరో రెండు అద్భుత ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఇమేజస్ అన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఫోన్లోని గ్యాలరీకే వెళ్లిపోతాయి. కొంతమంది ఆ ఇమేజస్‌ను ప్రైవసీ దృష్టిలో పెట్టుకుని ఫోన్ గ్యాలరీలో కనిపించకూడదని అనుకుంటారు. వాటిని వెంటనే డిలీట్ చేయడం చేస్తుంటారు. కానీ కొందరికి డిలీట్ చేసే తీరిక ఉండదు. ఈ అవసరాన్ని గుర్తించి, వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే మీడియా విజిబిలిటీ. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ మీడియా కంటెంట్ గ్యాలరీలో కనిపించాలో, హైడ్ చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. దీని కోసం వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి, డేటా, స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ షో మీడియా ఇన్ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిఫాల్ట్‌గా టిక్ చేసి ఉంటుంది. ఒకవేళ వాట్సాప్ ఇమేజస్ గ్యాలరీలో కనిపించకూడదంటే, దాన్ని అన్‌టిక్ చేసుకోవాలి. దాంతో గ్యాలరీలో వాట్సాప్ ఇమేజస్ కనిపించవు. అయితే ఆ ఇమేజస్‌ను ఫైల్ మేనేజర్‌కు వెళ్లి అక్కడ చూసుకోవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్‌లోని కొత్త బీటా వెర్షన్(2.18.159) యూజర్లకు ఈ మీడియా విజిబిలిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఇన్స్టాగ్రామ్ లాంటి పలు మెసేజింగ్ యాప్స్ అందిస్తున్నాయి. దీంతో పాటు మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. అది న్యూ కాంటాక్ట్ షార్ట్‌కట్. ఈ ఫీచర్ కూడా కొత్త బీటా వెర్షన్ వాళ్లకు అందుబాటులో ఉంది. చాట్ స్క్రీన్‌లో కింద కుడివైపున న్యూ మెసేజ్ బటన్‌ను ప్రెస్ చేస్తే, న్యూ కాంటాక్ట్ షార్ట్‌కట్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కాంటాక్ట్‌లను జత చేర్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్లను పొందడానికి వాట్సాప్ బీటా వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. -
వాట్సప్‌లో కలర్‌ఫుల్ సందేశాలు
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్లో మాదిరిగా వాట్సప్‌లోనూ కలర్‌ఫుల్ టెక్ట్స్ అప్డేట్స్ను పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రస్తుతం బేటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. వాట్సప్ కొత్త వెర్షన్లో మూడు ఆప్షన్లుంటాయి. ఫాంట్, బ్యాక్‌గ్రౌండ్ కలర్, ఎమోజిల్లో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. దాదాపు ఫేస్బుక్లో మాదిరిగానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎంచుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్‌తో స్టేటస్ పోస్ట్ చేయాలనుకునే వారు ముందుగా స్టేటస్ అప్డేట్ బాక్స్‌లోకి వెళ్లాలి. అక్కడ ఉండే పెన్సిల్ ఐకాన్‌పై ట్యాప్ చేస్తే ‘వాట్స్ ఇన్ యువర్ మైండ్?’ అని మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు కలర్ ప్యాలెట్‌లో నుంచి కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోవాలి. తరువాత టెక్ట్స్ టైప్ చేసి పోస్ట్ చేయాలి.