వాట్సప్‌లో కలర్‌ఫుల్ సందేశాలు
శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లో మాదిరిగా వాట్సప్‌లోనూ కలర్‌ఫుల్ టెక్ట్స్ అప్‌డేట్స్‌ను పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రస్తుతం బేటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. వాట్సప్ కొత్త వెర్షన్‌లో మూడు ఆప్షన్లుంటాయి. ఫాంట్, బ్యాక్‌గ్రౌండ్ కలర్, ఎమోజిల్లో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. దాదాపు ఫేస్‌బుక్‌లో మాదిరిగానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎంచుకోవాలి.
బ్యాక్‌గ్రౌండ్ కలర్‌తో స్టేటస్ పోస్ట్ చేయాలనుకునే వారు ముందుగా స్టేటస్ అప్‌డేట్ బాక్స్‌లోకి వెళ్లాలి. అక్కడ ఉండే పెన్సిల్ ఐకాన్‌పై ట్యాప్ చేస్తే ‘వాట్స్ ఇన్ యువర్ మైండ్?’ అని మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు కలర్ ప్యాలెట్‌లో నుంచి కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోవాలి. తరువాత టెక్ట్స్ టైప్ చేసి పోస్ట్ చేయాలి.