
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ పరికరాలు 5జీని సపోర్ట్ చేసేలా ప్రయోగాత్మకంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశీ టెలికం సంస్థల నుంచి 5జీ నెట్‌వర్క్‌కు యాక్సెస్ లభించిన యూజర్లు .. ఐఫోన్‌ల ద్వారా సదరు సర్వీసులను పొందడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ఈ బీటా ప్రోగ్రాం కోసం యూజర్లు యాపిల్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్ 12 అంతకు మించిన వెర్షన్లకు ఇది పని చేస్తుంది.
టెలికం సంస్థ జియో ప్రస్తుతం తాము 5జీ సర్వీసులు అందిస్తున్న నగరాల్లో యూజర్లకు జియో వెల్‌కమ్ ఆఫర్ పేరిట ప్రత్యేక ఆహ్వానాలు పంపుతోంది. వారికి ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత 5జీ డేటా అందిస్తోంది. అయితే, ఇందుకోసం ప్రీపెయిడ్ కస్టమర్లు రూ. 239 అంతకు మించిన ప్లాన్ ఉపయోగిస్తుండాలి. పోస్ట్ పెయిడ్ యూజర్లు అందరూ ఈ ఆఫర్‌కు అర్హులే. మరోవైపు, ఎయిర్‌టెల్ మాత్రం ఇటువంటి ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం లేదు. తాజా యాపిల్ బీటా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకున్నాక యూజర్లు తమ ప్రస్తుత ప్లాన్‌లో భాగంగానే 5జీ సర్వీసులను ట్రయల్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment