జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ నెల 30 నుంచి నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు చేయనుంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు తనిఖీలు చేయనుంది. అలాగే ఏప్రిల్ 6, 7,8 తేదీలలో నెల్లూరు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీ చేయనున్నారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడానికి వర్సిటీ అనుమతి ఇస్తుంది. విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి, ల్యాబ్ సదుపాయాలు, గ్రంథాలయం, విద్యా ప్రమాణాలు తదితర అంశాలను నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తుంది.