ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,ఖమ్మం లీగల్: బాలికపై అత్యాచారం చేసి మోసగించిన కేసులో సింగరేణి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పాయం నవీన్‌కు స్థానిక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎండీ..అఫ్రోజ్ అక్తర్ పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ముత్యాలగూడెం గ్రామానికే చెందిన బాలిక ఇంటర్ చదివే సమయంలో నవీన్ ఆమె వెంట పడి ప్రేమించానని నమ్మబలికాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2019 ఆగస్టు 18న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయాన శారీరకంగా లొంగదీసుకున్నాడు.
ఆ తర్వాత బాలిక, కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని కోరితే నిందితుడి కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఆ తర్వాత నవీన్‌ను వేరే గ్రామానికి పంపించగా, ఆయన మేనమామ చనిపోవడంతో 2020 జనవరి 11న గ్రామానికి వచ్చాడు. అప్ప్పుడు పెళ్లి విషయమై అడగగా గొడవ పడడంతో కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్, ఆయన కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం, మోసం తదితర నేరాలపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు విన్నాక నవీన్‌పై అత్యాచారం, మోసం చేసినట్లు కేసులు రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ.. మిగిలిన నిందితులపై కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ టి.హైమావతి వాదించగా.. లైజన్ అధికారి భాస్కర్‌రావు, కోర్టు కానిస్టేబుల్ సర్దార్‌సింగ్, హోంగార్డు చిట్టిబాబు సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment