
టోక్యో(జపాన్)కు చెందిన రిన్ కంబే మోడల్, డ్యాన్సర్. మోడలింగ్, డ్యాన్స్ వల్ల ఆమెకు పెద్దగా పేరేమి రాలేదుగానీ కేవలం జుట్టు వల్ల బోలెడు పేరు వచ్చింది. ఆమె శిరోజాల పొడవు అక్షరాలా ఆరు అడుగుల మూడు అంగుళాలు. పదిహేను సంవత్సరాల నుంచి జుట్టును కత్తిరించడం లేదట. తన జుట్టు గురించి రిన్ కంబే చాలా మురిపెంగా చెప్పుకుంటుంది..
‘నా జుట్టు భావవ్యక్తీకరణకు బలమైన ఆయుధం’
‘నా జుట్టు ఆసియా అందానికి ప్రతీక’....ఇలా గొప్పగా చెప్పుకోవడమే కాదు, ‘దెయ్యం జుట్టు’ అనే వెక్కిరింపుల గురించి కూడా ప్రస్తావిస్తుంది. జుట్టు పెంచడం, సంరక్షించడం అంతా వీజీ కాదని, తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది అనర్గళం గా చెబుతుంది. ఆమె కష్టం వృథా పోలేదు. పొడవైన జుట్టు తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment