
ఆమె ఆడవారికి అసూయ పుట్టిస్తోంది!
మాస్కో: జుట్టున్నమ్మ ఏ కొప్పయినా వేస్తుంది అంటారు. అది ముమ్మాటికీ నిజమే అనిపిస్తోంది ఈ రష్యా భామను చూస్తుంటే. గుబనోవ్ ఫ్రెకిల్ అనే యువతి జుట్టు ఇప్పటికే 150 సెంటీ మీటర్లు పెరిగి ఆడవారికి ఆసూయ పుట్టిస్తోంది. ఆ జుట్టుతో రకరకాల డిజైన్లతో అమ్మడు సోషల్ మీడియాలో ఉంచిన ఫోటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
తనకు పొడవైన జుట్టంటే ఇష్టమనీ.. అందుకే ఎప్పుడూ హెయిర్ కట్ జోలికి వెళ్లలేదని చెబుతోంది. నుంచున్నా అరికాళ్లను తాకేళా జుట్టు ఎప్పుడు పెరుగుతోందా అని వెయిట్ చేస్తోందట. జుట్టుకు సంబంధించిన సలహాలు కూడా ఇస్తానంటూ ఆఫర్ చేస్తోంది. అయితే.. ఎన్ని సంవత్సరాలు పెంచితే మాత్రం అందరికీ ఆ అదృష్టం ఉండొద్దూ అంటున్నారు సోషల్ మీడియాలో ఆమె జుట్టును చూసిన మహిళలు.