
ఇది ఏడడుగుల ‘తలకట్టు’..
పొడుగాటి జడ ఆడవారికి అలంకారంగా భావించడం కద్దు. కానీ, ఇక్కడ చిత్రంలో కనబడుతున్న వృద్ధుని జుట్టు చూస్తే ఎవరైనా ఔరా అనకమానరు. జడలు కట్టిన ఇతని జుట్టు అరికాళ్ల వరకూ పెరగడంతో ఆగక నేలపై పారాడుతోంది. విశాఖ జిల్లా బుచ్చియ్యపేట మండ లం విజయరామరాజుపేటకు చెందిన ఆడారి సీతారాం బాబా 30 ఏళ్ల క్రితం సన్యాసం తీసుకున్నారు. అప్పటి నుంచి పెరిగిన ఆయన జుట్టు ఇప్పుడు ఏడడుగులకు చేరింది. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని వచ్చారు. అయోధ్యలోని బాబా మణిరామ్ దాజీ కా చోటీ చౌవుని ఆశ్రమంలో గురూపదేశం పొంది, సన్యాసిగా మారానని ‘సాక్షి’కి తెలిపారు.
- తుని