స్మిత టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. సింగర్‌గా టాలీవుడ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండేపోయే పేరు. పాడుతా తీయగా అంటూ అభిమానులను గుండెల్లో నిలిచిపోయింది ఆమె. ఆ రోజుల్లోనే 'మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాల' అంటూ సినీ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది పాప్ సింగర్. స్వర్ణకమలం, సాగరసంగమం, స్వాతిముత్యం లాంటి హిట్ చిత్రాలకు ఆమె పాటలు పాడింది. ఇటీవలే నిజం విత్ స్మిత అంటూ ఓటీటీ షోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సింగర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను వివరించారు. ఆమె తన పెళ్లి, కెరీర్‌పై పలు విషయాలను వెల్లడించారు. అప్పట్లో మల్లీశ్వరి (2004), ఆట (2007) వంటి చిత్రాలతో పాటు డైయింగ్ టు బి మీ (2015) అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది.
స్మిత మాట్లాడుతూ.. 'నేను, నా భర్త వర్క్ విషయంలో చాలా ఫర్‌ఫెక్ట్. నా ఫ్రెండ్స్ కూడా శశాంక్‌ను బావ అని పిలుస్తారు. ఎందుకంటే మా పెళ్లి అనేది ఒక మిస్టరీ. అది మా స్నేహితుల వల్లే జరిగిందని చెప్పాలి. అతను ఏ అమ్మాయితో మాట్లాడింది లేదు. కానీ మా పెళ్లికి కుదిర్చిన వ్యక్తి మాత్రం నాగార్జున బ్రదర్ వెంకట్ అక్కినేని అంకుల్. పెళ్లి అంటే నాలో చాలా భయం ఉండేది. ఫ్రీడం లేదనిపించేది. కెరీర్ పరంగా నేను హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉండాల్సి వచ్చేది. కానీ పెళ్లి తర్వాత కూడా ఎవరి జీవితానికి వారికి ఫుల్ ఫ్రీడం ఉంది. ఏ విషయంలోనూ దేనికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మేం ఇద్దరం ఒకరి పనిలో ఒకరం తలదూర్చం. నేను పాడుతా తీయగా ప్రోగ్రామ్ సీజన్-2 తోనే వచ్చా. మమ్మీ, డాడీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాప్ సింగర్ కావడానికి మా నాన్నే కారణం. ఐడియా మా నాన్నది అయితే.. ముందుకు తీసుకెళ్లింది మాత్రం మా అమ్మే.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment