ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్‌గా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు.
చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు!
ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు.
దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్‌కు వెళ్లాను. పాండీబజార్‌లోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి.
చదవండి: ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..!
కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్ వైపు వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్‌ఫాదర్‌గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment