Nijam With Smita
-
ఆమె నా ఆల్‌టైమ్ ఫేవరేట్ హీరోయిన్: మెగాస్టార్
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ఓటీటీ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోనీలివ్‌లో ప్రసారమయ్యే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్‌గా పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా.. తొలి ఎపిసోడ్లో చిరంజీవి ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ షో లో పాల్గొన్న మెగాస్టార్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన సినీ జీవితంలో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్లపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలోని కొంతమంది నట దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అప్పట్లో మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకున్నవారి గురించి స్మిత ప్రశ్నించారు. రాధికా శరత్ కుమార్, రాధ, విజయ శాంతి, శ్రీ దేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. వాటి గురించి మెగాస్టార్ వివరించారు. సులభంగా, సహజంగా నటించే విషయంలో రాధిక ఫర్ఫెక్ట్ అని తెలిపారు. ఇక నాతో డ్యాన్స్ విషయంలో అయితే రాధ, విజయశాంతి జీవించేస్తారని అన్నారు. ఆ విషయంలో వారిద్దరి డ్యాన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. అయితే శ్రీ దేవితో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని వెల్లడించారు. అందువల్ల ఆమె ఎల్లప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని చిరంజీవి పేర్కొన్నారు. దివంగత శ్రీదేవి గురించి మాట్లాడుతూ..' ఆమెతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే పరిగణిస్తారు. శ్రీదేవి నటన, డ్యాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మోసగాడు', 'ఎస్పీ పరశురామ్' లాంటి సూపర్ హిట్ సినిమాలు చేయగలిగా.' అని అన్నారు మెగాస్టార్. -
అతడి కంటే అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్‌గా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు. దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్‌కు వెళ్లాను. పాండీబజార్‌లోని ఫిలిం ఇన్స్టిట్యూట్కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి. చదవండి: ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..! కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్ వైపు వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్‌ఫాదర్‌గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు. -
జనాలు నాపై కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి
సింగర్ స్మిత త్వరలో నిజం విత్ స్మిత అనే టాక్ షోతో ముందుకు రాబోతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత, కెరియర్ విషయాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ షో ఒక వేదిక కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో ప్రసారం కానున్న ఈ షో మెగాస్టార్ చిరంజీతో ప్రారంభం కానుంది. ఈమేరకు ఓ ప్రోమో కూడా విడుదలైంది. స్టార్డమ్ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది, ఆ స్టేజీకి వెళ్లడానికి ఎన్నో అవమానాలు పడి ఉంటారు, అవునా? అని స్మిత అడిగింది. దీనికి చిరు స్పందిస్తూ.. జగిత్యాలలో నాపై నుంచి పూల వర్షం కురిసింది. కొంత ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు విసిరారు అని తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించాడు చిరు. అసలు తనపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు? మెగాస్టార్ పంచుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలియాలంటే ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: చేతిపై పచ్చబొట్టు.. నా భార్య.. కన్నతల్లిలా చూసుకుంది: కల్యాణ్ రామ్