Nijam With Smitha Talk Show: Chiranjeevi Shares About Bad Experience In Jagtial - Sakshi
Sakshi News home page

Chiranjeevi: జగిత్యాలలో నాపై కోడిగుడ్లు విసిరారు

Published Wed, Feb 8 2023 12:32 PM | Last Updated on Wed, Feb 8 2023 1:31 PM

Nijam with Smitha: Chiranjeevi Shares Jagtial Bad Experience - Sakshi

సింగర్‌ స్మిత త్వరలో నిజం విత్‌ స్మిత అనే టాక్‌ షోతో ముందుకు రాబోతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత, కెరియర్‌ విషయాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ షో ఒక వేదిక కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌లో ప్రసారం కానున్న ఈ షో మెగాస్టార్‌ చిరంజీతో ప్రారంభం కానుంది. ఈమేరకు ఓ ప్రోమో కూడా విడుదలైంది.

స్టార్‌డమ్‌ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది, ఆ స్టేజీకి వెళ్లడానికి ఎన్నో అవమానాలు పడి ఉంటారు, అవునా? అని స్మిత అడిగింది. దీనికి చిరు స్పందిస్తూ.. జగిత్యాలలో నాపై నుంచి పూల వర్షం కురిసింది. కొంత ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు విసిరారు అని తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించాడు చిరు. అసలు తనపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు? మెగాస్టార్‌ పంచుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలియాలంటే ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: చేతిపై పచ్చబొట్టు.. నా భార్య.. కన్నతల్లిలా చూసుకుంది: కల్యాణ్‌ రామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement