Sai Pallavi With Singer Smitha In Nijam With Smitha Talk Show, Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Pallavi: సెన్సేషనల్‌ టాక్‌ షోకు సాయి పల్లవి.. వాటికి సమాధానాలు దొరికినట్టేనా!

Published Thu, Feb 2 2023 6:10 PM | Last Updated on Thu, Feb 2 2023 7:33 PM

Sai Pallavi With Singer Smitha in Nijam With Smitha Talk Show - Sakshi

తెలుగు హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. అందుకే దర్శకులు కూడా సాయి పల్లవి రోల్‌ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇక ఆమె గ్లామర్స్‌ పాత్రలకు దూరమనే విషయం తెలిసిందే. స్కీన్‌ షో ఉంటే అది స్టార్‌ హీరో బడా డైరెక్టర్‌ చిత్రమైన నో చెబుతుంది. అందుకే సినిమా ఫలితాలతో సంబంధంగా లేకుండా వ్యక్తిగతం ఆమెను అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. అయితే లవ్‌స్టోరితో కమర్షియల్‌ హిట్‌ అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నటించిన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.

చదవండి: బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?

తన నటనతో మెప్పించినప్పటికి కమర్షియల్‌గా మాత్రం విజయం సాధించలేకపోతున్నాయి. దాంతో ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. అంతేకాదు మీడియాకు, సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. దీంతో సాయి పల్లవి పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పిందా? అని ఆమె అభిమానలంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కొద్ది రోజులు ఇకపై ఆమె నటించదనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. మరోవైపు ఆమె పెళ్లి చేసుకుబోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇంతవరకు ఈ న్యాచురల్‌ బ్యూటీ నుంచి క్లారిటీ రాలేదు. దాంతో అంతా అదే నిజమనుకుంటున్నారు.

చదవండి: కత్రినా వచ్చాక నా లైఫ్‌ మారిపోయింది.. నేను పర్‌ఫెక్ట్‌ హస్భెండ్‌ కాదు..!: విక్కీ కౌశల్‌

ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఓ టాక్ షోలో పాల్గొన్నారు. సోనీ లైవ్‌లో త్వరలో ప్రసారం కానున్న 'నిజం విత్ స్మిత' షోలో ఆమె పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న సాయి పల్లవి ఎపిసోడ్ ప్రసారం కానుంది. చూస్తుంటే ఈ  ఎపిసోడ్ కొంచెం వాడివేడిగానే సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. ఇందులో సాయి పల్లవి కాస్తా గట్టిగా రియాక్ట్‌ అయినట్లుంది. ఈ వీడియోలో ఆమె ఫిజికల్‌ అబ్యూస్‌, వర్బల్‌ అబ్యూస్‌ అంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేస్తూ కనిపించింది. దాంతో సాయి పల్లవి ఎపిసోడ్ ఆసక్తిని సంతరించుకుంది. ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement