సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వంద రోజుల కూటమి పాలనలో ప్రతీరోజు మహిళల హత్యలు, హత్యాచారాలే జరుగుతున్నాయన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇదే సమయంలో పుంగనూరుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిసి హోంమంత్రి అనిత ఈరోజు బాలిక కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో ముస్లిం బాలిక హత్య జరిగి వారం రోజులు అవుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలియడంతో ఈరోజు మాత్రం హోంమంత్రి అనిత పుంగనూరు వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. హత్య జరిగిన వారం రోజులు గడిచినా.. ఇన్ని రోజులు చంద్రబాబు, మంత్రులు ఏం చేశారు?. ఆగమేఘాల మీద ఇప్పుడు ఎందుకు వెళ్లారు?. వైఎస్ జగన్ బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని తెలిసి మంత్రులు రాజకీయం చేస్తున్నారు.
హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా చంపితే ఎందుకు పరామర్శించలేదు. గుడ్లవల్లేరు దారుణ ఘటనలో విద్యార్థులకు ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో కూటమి వంద రోజుల పాలనలో రోజూ మహిళలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహిళల కోసం వైఎస్ జగన్ దిశా చట్టాన్ని, యాప్ ఏర్పాటు చేశారు’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: గోల్‌మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా!
Comments
Please login to add a commentAdd a comment