17 అంశాలలో భేష్
పుంగనూరు: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనితీరులో మెరుగ్గా ఉంటు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది పుంగనూరు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పనితీరును ప్రభుత్వం పరిశీలించింది. 17 అంశాలలో మున్సిపాలిటీల పనితీరును అంచనా వేసేందుకు 100 మార్కులు నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపాలిటీల ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్, మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పనితీరును అనుసరించి మార్కులు కేటాయించారు. ఈ కేటాయింపులో పుంగనూరు మున్సిపాలిటీ ఉత్తమ సేవలకు 75.17మార్కులు పొందింది. దీంతో నెంబరు వన్‌గా నిలిచింది.
ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడం, పన్నుల వృద్ధి, విజ్ఞప్తుల పరిష్కారం, ఐఐటీ ఫౌండేషన్, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్‌ప్లానింగ్, డ్వాక్రాగ్రూపుల రుణాల పంపిణీ, గ్రీనరీ, స్వచ్ఛభారత్, స్కిల్‌డెవలెప్‌మెంట్, పాఠశాలలో కెరీర్ ఫౌండేషన్ కోర్సుల నిర్వహణ, అన్నిరకాల పెన్షన్లు పంపిణీ, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, అభివృద్ధి పనుల్లో నాణ్యత, ఇంకుడు గుంతల కార్యక్రమం, లెక్కల నిర్వహణ తనిఖీ అంశాలలో మున్సిపాలిటి పనితీరుకు నెంబర్‌వన్ ర్యాంకు లభించింది.