
చిత్తూరు: టీడీపీ రౌడీ మూకలు అవకాశం దొరికిందే తడువుగా రెచ్చిపోతున్నాయి. తాజాగా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. తమ గ్రామంలో ఏ సమస్యలు లేవని చెప్పినందకు గ్రామంలో ఉండే స్థానికులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం సంజం పేటలో ఇదేం కర్మ పేరిట టీడీపీ కార్యక్రమం చేపట్టింది. టీడీపీ నియోజకవర ఇంచార్జి చల్ల రామచద్రారెడ్డి నేతృత్వంలో గ్రామంలోకి వెళ్లారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మీ గ్రామంలో సమస్యలు చెప్పండి’ అంటూ ఆరా తీయబోయారు ఆ గ్రామంలోకి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు.
కానీ వారు ఊహించని జవాబు స్థానికుల్ని వచ్చింది. తమకు ఏ సమస్యలు లేవని చెప్పడంతో టీడీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. అంతే దీంతో టీడీపీ మూకలు రెచ్చిపోయి ప్రవర్తించాయి. రాళ్లు, హాకీ స్టిక్స్‌తో రెచ్చిపోయారు. అక్కడున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. స్థానికులు తిరగబడటంతో చేసేది లేక అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాయి టీడీపీ అల్లరి మూకలు.