
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుందని ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, బెటర్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీలో హింసా రాజకీయాలు నివారణా చర్యలు - మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘‘చంద్రబాబు లోకేష్ తమ మీటింగుల ద్వారా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక జిల్లా ఎస్పీ పేరు రెడ్ బుక్‌లో రాసుకుని ఆయనను ఏదో చేస్తామని బెదిరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటికి దెబ్బ తగిలితే ఈనాడు మొదటి పేజీలో వేసింది.. చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. పుంగనూరులో ఒక కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోతే ఈనాడు, చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారో చూస్తున్నాం’’ అని కొమ్మినేని పేర్కొన్నారు.
‘‘పుంగనూరు ఘర్షణలో ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయొద్దని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశించారు. లేదంటే పోలీసులు ఫైర్ చేసేవాళ్లు.. టీడీపీ కార్యకర్తలు మరింత పేట్రేగిపోయి ఉండేవారు. దెబ్బలు తిన్న పోలీసులపై సానుభూతి కాకుండా వాళ్లే తప్పు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ కొమ్మినేని తప్పుబట్టారు.
చదవండి: మాచర్లలో భరతుడంటా!.. లోకేశ్ మళ్లీ ఏసేశాడు
Comments
Please login to add a commentAdd a comment