పుంగనూరు (చిత్తూరు జిల్లా): పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు.
వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పలమనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు.
ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు
Comments
Please login to add a commentAdd a comment