
షికారిపాళెంలో బీటలు వారిన ఇల్లు
పుంగనూరు(చిత్తూరు జిల్లా) : పుంగనూరు మండలంలోని ఈడిగపల్లె, కోటగడ్డ, బోడేవారిపల్లె, చిలకావారిపల్లె, కురవూరు, షికారిపాళెం గ్రామాల్లో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రెండు సార్లు కొన్ని సెకండ్ల పాటు భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు అరుపులు, కేకలు పెడుతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని వస్తువులు నేలపై పడ్డాయి. ఎలాంటి ప్రమాదం, ప్రాణనష్టం సంభవించలేదు. షికారిపాళెంలో ఇళ్లు బీటలు వారాయి. విషయం తెలుసుకున్న కలెక్టర్ హరినారాయణ్, తహసీల్దార్ వెంకట్రాయలుకు ఫోన్ చేసి గ్రామాలను సందర్శించి, నివేదికలు పంపాలని ఆదేశించారు. అయితే ఈ ప్రాంతంలో రిక్టర్‌స్కేల్ అందుబాటులో లేకపోవడంతో దాని తీవ్రత తెలియలేదని అధికారులు చెప్పారు.