రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు ఖర్చు చేస్తున్న రూ.400 కోట్లను ఎక్కడి నుంచి తెచ్చారని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశ్నించారు.
పుంగనూరు (చిత్తూరు) : రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు ఖర్చు చేస్తున్న రూ.400 కోట్లను ఎక్కడి నుంచి తెచ్చారని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశ్నించారు. అది ప్రజాధనం కాదా అని నిలదీశారు. సోమవారం పుంగనూరులో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలను ఆయన సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాజధాని నిర్మాణం రియల్ ఎస్టేట్ కోసమేనన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని నారాయణస్వామి చెప్పారు. మరోవైపు ప్రత్యేక హోదాకు మద్దతుగా పీలేరు ఎంపీడీవో కార్యాలయం ముందు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు.