9న పుంగనూరుకు వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan To Visit Punganur On October 9th, More Details Inside | Sakshi
Sakshi News home page

YS Jagan Punganur Visit: 9న పుంగనూరుకు వైఎస్‌ జగన్‌

Published Sat, Oct 5 2024 7:23 AM | Last Updated on Sat, Oct 5 2024 10:00 AM

Ys Jagan Visit To Punganur On October 9th

 హత్యకు గురైన చిన్నారి అంజుమ్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్‌ (7) కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నారు. ఈ మేరకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అంజుమ్‌ కిడ్నాప్, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ రానున్నారని, మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు కూడా వస్తారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.

ఇదీ చదవండి: తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement