Sajjala Ramakrishna Reddy Comments On TDP Leaders Attacks On YSRCP In Punganur, Details Inside - Sakshi
Sakshi News home page

Sajjala Ramakrishna Reddy: అంగళ్లులో పథకం ప్రకారమే ప్లాన్‌.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్‌.. 

Published Fri, Aug 4 2023 6:30 PM | Last Updated on Fri, Aug 4 2023 8:55 PM

Sajjala Ramakrishna Reddy Comments On TDP Attacks In Punganur - Sakshi

సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎల్లో బ్యాచ్‌ రెచ్చిపోయి కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా దాడులు చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం, పోలీసుల వాహనాలకు కూడా నిప్పటించారు. మరోవైపు.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. టీడీపీ శ్రేణులు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను జిల్లా ఎస్పీ పరామర్శించారు.

ఇక, టీడీపీ నేతల దౌర్జన్యకాండపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాజాగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనంతో ఉన్నారు. కావాలనే చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రస​ంగాలు చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలి. అంగళుల్లో పథకం ప్రకారమే టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తానే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే పిచ్చితో చంద్రబాబు ఉన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు’ అని ఫైరయ్యారు. 

చంద్రబాబు దూషణలు..
కాగా, చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇక, టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో​ దాడులకు దిగారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఈ క్రమంలోనే అక్కడున్న పోలీసులను చంద్రబాబు తీవ్ర పదజాలంతో దూషించారు. గాడిదలు కాస్తారా అంటూ పోలీసులను చంద్రబాబు దూషించారు. 

ఇది కూడా చదవండి: టీడీపీ నేతల అరాచకం.. కర్రలు, రాళ్లతో దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement