పుంగనూరు మండల కార్యాలయంలో బుధవారం రూ.3 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉదయకుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
- పట్టా పాసు పుస్తకం పేరు మార్పునకు లంచం
- రూ.3 వే లు తీసుకుంటూ పట్టుబడిన వైనం
పుంగనూరు, న్యూస్‌లైన్: పుంగనూరు మండల కార్యాలయంలో బుధవారం రూ.3 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉదయకుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అవినీతి అధికారిని పుంగనూరు తొలి ఎమ్మెల్యే బాడాల కృష్ణమూర్తి మనుమ డు వెంకటప్రసాద్ ఏసీబీకి పట్టించా రు. బాడాల కృష్ణమూర్తి సతీమణి జయలక్ష్మమ్మ, ఆమె కుమార్తె లీలావతి, మనువడు వెంకటప్రసాద్ మండలంలోని రాంపల్లె సమీపంలో ఇందిర మ్మ ఇంటిలో నివాసముంటున్నారు. వెంకటప్రసాద్ తనతల్లి పేరున సర్వే నెంబర్ 43లో ఉన్న 1.41 ఎకరాల పొలం పట్టాదారు పాసు పుస్తకాన్ని రద్దుచేసి తన పేరుపై మార్చాలని రెండు నెలల కిందట రెవెన్యూ అధికారులకు అర్జీ సమర్పించాడు. పది రోజుల కిందట వెంకటప్రసాద్‌ను పిలిపించి ఆర్‌ఐ ఉదయకుమార్‌రెడ్డి బేరం పెట్టారు.
రూ.3 వేలకు ఒప్పం దం కుదుర్చుకుని, డబ్బులు ఇస్తే పని పూర్తి చేస్తానని తెలిపాడు. దీనిపై వెంకటప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ రాజారావు, సీఐలు రామకిషోర్, చంద్రశేఖర్, లక్ష్మీకాంతరెడ్డి, సుధాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. బుధవారం పథకం ప్రకారం ఆర్‌ఐకి వెంకటప్రసాద్ ద్వారా డబ్బు పంపారు. ఆర్‌ఐ డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని, ఆర్‌ఐని అరెస్ట్ చేశారు.
అవినీతి అధికారుల సమాచారం ఇవ్వండి..
అవినీతి అధికారుల సమాచారం ఇవ్వాలని ఏసీబీ ఎస్పీ రాజారావు కోరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు లంచాల కోసం వేధించినా, ఆదాయానికి మించి ఆస్తు లు ఉన్నా తమకు తెలియజేయవచ్చన్నారు. తిరుపతిలో తమ కార్యాలయ నంబర్లు 9440446190, 944044 6102, 9440446193 ,9440446138, 9440808112కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.