పుంగనూరులో తమిళనాడు పోలీసులు తనిఖీలు | Tamil Nadu Special Police frisking at punganur in chittoor district | Sakshi
Sakshi News home page

పుంగనూరులో తమిళనాడు పోలీసులు తనిఖీలు

Published Thu, Oct 10 2013 8:44 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Tamil Nadu Special Police frisking at punganur in chittoor district

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఇటీవల అల్ ఉమా సంస్థకు చెందిన తీవ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో పుంగనూరులో గత అర్థరాత్రి నుంచి తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పుంగనూరులోని నక్కబండ కాలనీలో ప్రతి ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందుకోసం పుంగనూరులో తమిళనాడు ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా మోహరించారు.  దాంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

 

అల్ ఉమా తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులను తమిళనాడులోని తిరువళ్లూరు పోలీసులు నాలుగురోజుల క్రితం  పుత్తూరులో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల బ్రహ్మోత్సవాలలో బాంబు పేలుళ్లు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తీవ్రవాదులు తమ విచారణలో వెల్లడించారని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement