చిన్నారి కళ్ల నుంచి రాలుతున్న రాళ్లు | stones are coming from eyes | Sakshi
Sakshi News home page

చిన్నారి కళ్ల నుంచి రాలుతున్న రాళ్లు

Published Wed, Feb 12 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

చిన్నారి కళ్ల నుంచి రాలుతున్న రాళ్లు

చిన్నారి కళ్ల నుంచి రాలుతున్న రాళ్లు


 మన్నెగూడెం(డోర్నకల్), న్యూస్‌లైన్ :
 కంటిలో చిన్న నలుసు పడితేనే తట్టుకోవడం కష్టం. కళ్లలో దుమ్ము, దూళి పడితే పడే ఇబ్బంది అంతా.. ఇంతా కాదు. కానీ ఓ చిన్నారి కళ్లలో నుంచి ఏకంగా శనగ గింజ సైజులో రాళ్లు బయటపడతున్నారుు. దీంతో ఆ బాలిక పడుతు న్న బాధ వర్ణణాతీతంగా మారింది. అర గంటకోసారి నరకం అనుభవిస్తోంది. కళ్ల నుంచి రాళ్లతోపాటు రక్తం కారుతుండడం తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 
 డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన తేజావత్ కృష్ణ, లక్ష్మి దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె సాయితేజ స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం నుంచి సాయితేజ కళ్ల నుంచి రక్తం కారడంతోపాటు రెండు కళ్ల నుంచి రాళ్లు వస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నా రు. ఆరు నెలల క్రితం కూడా ఇలాగే బాలిక కళ్ల నుంచి రక్తం, రాళ్లు రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు  ఎలాంటి జబ్బు లేదని తేల్చారు. రాళ్లు ఎందుకు వస్తున్నాయని అడిగితే హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు.
 
 భూత వైద్యుడిని ఆశ్రరుుంచిన తల్లిదండ్రులు
 హైదరాబాద్‌కు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటికి వచ్చి భూతవైద్యుడికి చూపగా రాళ్ల రావడం ఆగిపోయాయని సాయితేజ తల్లిదండ్రులు కృష్ణ, లక్ష్మి తెలిపారు. తిరిగి రెండు రోజులుగా సాయితేజ కళ్ల నుంచి రక్తం, రాళ్లు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ అరగంటకు ఒకసారి రెండు కళ్ల నుంచి రక్తంతోపాటు రారుు వస్తుండడంతో సాయితేజ నరకయాతన అనుభవిస్తోంది. శనగ గింజ కంటె పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లు కళ్ల నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల నుంచి రాళ్లు రావడాన్ని ప్రత్యక్షంగా గమనించిన గ్రామస్తులు సాయితేజ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం కృష్ణ, లక్ష్మీ దంపతులకు చెందిన ఇల్లు అగ్నిప్రమాదానికి గురై సర్వం అగ్నికి ఆహుతవడంతో నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు సాయితేజకు వింత జబ్బు రావడంతో వైద్యం చేయిం చలేని దుస్థితిలో ఉన్నామని అధికారులు, దయామయులైన దాతలు తమ కూతురికి వైద్యం చేయించేందుకు సాయం చేసి ఆదుకోవాలని సాయితేజ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement