ఉత్తరప్రదేశ్‌లో ‘వందేభారత్‌’పై రాళ్ల దాడి! | Uttar Pradesh: Stones Pelted On Vande Bharat Train | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ‘వందేభారత్‌’పై రాళ్ల దాడి!

Published Tue, Mar 19 2024 7:21 AM | Last Updated on Tue, Mar 19 2024 9:03 AM

Uttar Pradesh Stones Pelted on Vande Bharat Train - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనతో రైల్వేశాఖలో కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 

యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై ఈ రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement