మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే లక్షణాలు | Symptoms of kidney stones were | Sakshi
Sakshi News home page

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే లక్షణాలు

Published Mon, Aug 25 2014 11:31 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే లక్షణాలు - Sakshi

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే లక్షణాలు

లక్షణాలు
 
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే ఆ విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని లక్షణాలు స్వయంగా రోగికి అనుభవంలోకి వస్తుంటాయి. అవి...
 
మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి  మూత్రంతోపాటు రక్తం
 
చలిజ్వరం  మూత్రం దుర్వాసన రావడం, రంగు మారడం
 
వెనుకవైపు ఛాతీకి- పిరుదులకు మధ్య (లోవర్ ఎబ్డామిన్) సన్నగా మెలిపెట్టినట్లు నొప్పి వస్తుంది. నొప్పి తీవ్రత పెరిగినప్పుడు తల తిరగడం, వాంతి కావడం వంటి లక్షణాలు కూడా తోడవుతుంటాయి. ఈ లక్షణాలలో ఏది కనిపించినా పరీక్ష చేయించుకోవడం మంచిది.
 
గమనిక: రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు మూత్ర విసర్జన సమయంలోనే బయటకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లే క్రమంలో మూత్రవాహిక ఒరుసుకుపోయినట్లు అనిపించవచ్చు. అంతే తప్ప పైన చెప్పిన లక్షణాలు కనిపించవు. మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లు రెండు మీల్లీమీటర్ల కంటే పెద్దవైనప్పుడు పై లక్షణాలు బయటపడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement