కర్ణాటక: సాలిగ్రామ అనే రాయిని అదృష్టం రాళ్లు అంటూ నమ్మించి వంచనకు పాల్పడుతున్న మనోజ్, ఆదిత్యసాగర్ అనే వ్యక్తులను అరెస్ట్‌చేసినట్లు సీసీబీ జాయింట్ పోలీస్‌కమిషనర్ డాక్టర్ ఎస్‌డీ.శరణప్ప తెలిపారు. నిందితులు రాజాజీనగర డాక్టర్ రాజ్‌కుమార్‌రోడ్డులోని ప్రైవేటు హోటల్‌లో బస చేశారు. వినియోగదారులను అక్కడకు పిలిపించి గుజరాత్‌లోని గోమతి నది నుంచి సాలిగ్రామ రాళ్లు తెప్పించామని, ఇవి విష్ణురూపమని, వీటిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమని, వీటిని రూ.2కోట్లకు విక్రయిస్తామని చెప్పారు. పక్కా సమాచారంతో శుక్రవారం సీసీబీపోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్ చేశారు. సాలిగ్రామ రాళ్లను స్వాదీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment