Lucky
-
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
అదృష్టం వరించే రాళ్లంటూ వంచన
కర్ణాటక: సాలిగ్రామ అనే రాయిని అదృష్టం రాళ్లు అంటూ నమ్మించి వంచనకు పాల్పడుతున్న మనోజ్, ఆదిత్యసాగర్ అనే వ్యక్తులను అరెస్ట్‌చేసినట్లు సీసీబీ జాయింట్ పోలీస్‌కమిషనర్ డాక్టర్ ఎస్డీ.శరణప్ప తెలిపారు. నిందితులు రాజాజీనగర డాక్టర్ రాజ్కుమార్రోడ్డులోని ప్రైవేటు హోటల్లో బస చేశారు. వినియోగదారులను అక్కడకు పిలిపించి గుజరాత్‌లోని గోమతి నది నుంచి సాలిగ్రామ రాళ్లు తెప్పించామని, ఇవి విష్ణురూపమని, వీటిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమని, వీటిని రూ.2కోట్లకు విక్రయిస్తామని చెప్పారు. పక్కా సమాచారంతో శుక్రవారం సీసీబీపోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్ చేశారు. సాలిగ్రామ రాళ్లను స్వాదీనం చేసుకున్నారు. -
లేటు వయసులో జాక్‌పాట్.. రూ.5కోట్లు గెలుచుకున్న వృద్ధుడు
చండీగఢ్: అదృష్టం తలుపుతడితే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి అంటారు. పంజాబ్ డేరాబస్సికి చెందిన ఓ వృద్ధుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 88 ఏళ్ల వయసులో అతనికి జాక్‌పాట్ తగిలింది. సంక్రాంతి లాటరీలో ఏకంగా రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనికి పూలమాలలు వేసి అభినందించారు. లాటరీ గెలుచుకున్న ఇతని పేరు మహంత్ ద్వారకా దాస్. డేరాబస్సిలోని త్రివేది క్యాంప్‌లో నివాసముంటున్నాడు. 1947లో 13 ఏళ్ల వయసులో పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. సాధారణ కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు. అయితే ఇతనికి ఓ అలవాటు ఉంది. గత 40 ఏళ్లుగా తరచూ లాటరీలు కొనుగోలు చేస్తున్నాడు. ఏదో ఒకరోజు అదృష్టం తన తలుపుతట్టి కుటుంబం తలరాత మారుతుందని ఆశించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఓ ల్యాటరీ కొనుగులు చేశాడు. కచ్చితంగా కొన్ని అంకెలు ఉండే లాటరీ నంబర్ కావాలని చెప్పి తన మనవడితో దీన్ని కొనుగోలు చేయించాడు. కొద్ది రోజుల తర్వాత అదే నంబర్‌కు లాటరీ తలిగింది. దీంతో మహంత్ కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. లాటరీ గెలుచుకున్న వృద్ధుడు.. ఈ లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకోగా.. ట్యాక్స్ పోను అతనికి రూ.3.5 కోట్లు రానుంది. ఇందులో సగం తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచుతానని, మిగతా సగం డేరాకు విరాళంగా ఇస్తానని మహంత్ పేర్కొన్నాడు. ఇన్నాళ్లకు తన లాటరీ కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. చదవండి: హిమగర్భంలో భారీ ఉల్క -
అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు
అందరూ ఏదైనా మంచి జరగలాంటే మనకు అదృష్టం ఉండాలి అంటుంటారు. కాస్త మన హార్డ్‌వర్క్‌కి కొంచెం లక్ తోడైతే ఇక మనకు తిరుగుండదు. ఔనా! ఇంతకీ ఎందుకూ ఈ అదృష్టం గురించి చెబుతున్నానంటే ఇక్కడున్న మహిళకు అదృష్టం మాములుగా లేదు. ఒకేసారి ఉబ్బితబ్బిబై ఎగిరి గంతేసేంత పట్టరాని ఆనందం ఒకేసారి వరించింది. వివరాల్లోకెళ్లే...అమెరికాలోని నార్త్‌కరోలినాలోని ఒక మహిళ ఒకేసారి రెండు జాక్పాట్లు కొట్టేసింది. ఈ మేరకు బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ అనే 28 ఏళ్ల మహిళ పండటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపట్లోనే ఆమె రూ. 81 లక్షల లాటరీని గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె అమెరికాలోని కాంకర్డ్ సిటీలోని ఒక క్విక్‌ట్రిప్ స్టోర్ నుంచి పవర్‌బాల్ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆమె సరిగ్గా నవంబర్ 9న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదే రోజు కొద్ది నిమిషాల్లోనే ఆమె లాటరీ గెలిచుకున్నట్లు లాటరీ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ మేరకు హెర్నాండెజ్ మాట్లాడుతూ...కచ్చితంగా ఈ చిట్టితల్లి వల్లే తాను ఈ లాటరీ గెలుచుకున్నాను, ఆమె నా అదృష్టదేవత అంటూ మురిసిపోయింది. అలాగే మిగతా నా ఇద్దరు మగ పిల్లలు కూడా ఈ అదృష్టంలో భాగమే. ఎందుకంటే ఈ లాటరీని ఆ ఇద్దరు పిల్లల పుట్టిన రోజుల నెంబర్లను ఆధారంగా లాటరీ టిక్కెట్‌ని ఎంచుకుని కొనుగోలు చేయడంతో గెలవగలిగానని ఆనందంగా చెబుతోంది. (చదవండి: వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు) -
కెరీర్ కాంతిమంతం
దీపం జీవితానికి ప్రతీక. ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. ఆ వెలుగును ఒడిసిపట్టుకోవడం తెలిస్తే జీవితం ప్రకాశవంతమవుతుంది. సరదాగా నేర్చుకున్న క్యాండిల్ మేకింగ్‌తో జీవితాన్ని కాంతిమంతం చేసుకున్న సుజాత మేడబాల అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లక్కీ క్యాండిల్స్... ఇది హైదరాబాద్, ప్రగతినగర్‌లో ఓ చిన్న పరిశ్రమ. పరిశ్రమ చిన్నదే కానీ, అందులో తయారయ్యే క్యాండిల్స్ మాత్రం చిన్నవి కావు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని భుజాన మోసినట్లు మోయాల్సినంత పెద్ద క్యాండిల్స్ తయారవుతాయక్కడ. రెండు అడుగుల చుట్టుకొలత, రెండున్నర అడుగుల ఎత్తున్న క్యాండిల్ అది. అందుకే ఆ క్యాండిల్ పేరు సరదాగా బాహుబలి క్యాండిల్‌గా వ్యవహారంలోకి వచ్చేసింది. ఇంతకీ బాహుబలి క్యాండిల్ బరువు ఎంతో తెలుసా? 30 కేజీలు. ధర తెలిస్తే క్యాండిల్ వెలుగులో చుక్కలు కూడా కనిపిస్తాయి మరి. ఆ క్యాండిల్ ధర 30 వేల రూపాయలు. ఇది కస్టమైజ్డ్ క్యాండిల్ అని, ఒకరు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారని, ఈ క్యాండిల్ కోసం ప్రత్యేకంగా మౌల్డ్ తయారు చేయించాల్సి రావడంతో ఆ ధర తప్పలేదని చెప్పారు సుజాత. ఆమె పరిశ్రమలో తయారయ్యే క్యాండిల్స్‌లో ఎక్కువ భాగం డిజైనర్ క్యాండిల్సే. పిల్లర్ క్యాండిల్, కంటెయినర్ క్యాండిల్, సెంటెడ్ క్యాండిల్, పెయింటెడ్ క్యాండిల్, ప్రింటెడ్ క్యాండిల్, ఫ్లోటింగ్, పర్సనల్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. పండుగలు, ఇతర ధార్మిక వేడుకల కోసం రిచువల్స్ క్యాండిల్స్ ప్రత్యేకం. ‘‘దీపం వెలుగు మనసును ఉత్తేజితం చేస్తుంది. అందుకే సెంటెడ్, అరోమాటిక్ క్యాండిల్స్‌లో సందర్భాన్ని బట్టి ఫ్రాగ్నెన్స్ను ఎంచుకోవాలి. మా ప్రయోగంలో నాలుగురకాల నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ ఉన్నాయి. వాటిలో సోయా వ్యాక్స్, కోకోనట్ వ్యాక్స్, పామ్ వ్యాక్స్ క్యాండిల్స్... ఈ మూడు వేగన్ క్యాండిల్స్. అంటే ఈ మైనం జంతువులు, పక్షుల వంటి ఏ ప్రాణి నుంచి సేకరించినది కాదు. ఇక నాచురల్ వ్యాక్స్‌లో నాలుగవది బీ వ్యాక్స్. తేనెపట్టు నుంచి సేకరించే మైనం అన్నమాట. సాధారణంగా క్యాండిల్ తయారీలో ఉపయోగించేది పారాఫిన్ వ్యాక్స్. ఇప్పుడు నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు, ధర గురించి పట్టింపు కూడా ఉండడం లేదు. దాంతో ప్రయోగాలు చేయడానికి అవకాశం కూడా బాగా ఉంది. నేను పదేళ్లుగా ముగ్గురు ఉద్యోగులతో ఈ పరిశ్రమ నడిపిస్తున్నాను. ముగ్గురూ మహిళలే. మహిళలనే ఎందుకు చేర్చుకున్నానంటే... ఇది భుజబలంతో చేసే పని కాదు, సృజనాత్మకంగా చేయాల్సిన పని. పైగా మొత్తం చేతుల మీద జరిగే పని. భారీ మొత్తంలో మైనాన్ని కరిగించి ఒకే మూసలో పోయడం కాదు, ప్రతిదీ ప్రత్యేకమే. మనసు పెట్టి చేయాల్సిన పని. సహనం కూడా చాలా ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలైతే బావుంటుందనుకున్నాను. అలాగే ఒక మహిళగా సాటి మహిళలకు అవకాశం ఇస్తే బావుంటుందని కూడా అనిపించింది. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, భారీ ఆర్డర్ ఉన్నప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా మహిళలకే’’ అన్నారు సుజాత. వైజాగ్‌లో చిరుదీపంగా మొదలైన పరిశ్రమ, హైదరాబాద్‌లో కాంతులు విరజిమ్ముతున్న వైనాన్ని కూడా వివరించారామె. ‘‘వైజాగ్‌లో ఒక టైనింగ్ ప్రోగ్రామ్‌లో ఒకరోజు శిక్షణ తీసుకున్నాను. అది కూడా సరదాగానే. పిల్లలు పెద్దయిన తర్వాత ఖాళీ దొరికింది. దాంతో నేర్చుకున్న పనిని రకరకాలుగా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచిస్తూ పేపర్ కప్పు క్యాండిల్ చేశాను. అలా మొదలైన ప్రయోగాలను కొనసాగిస్తూ వచ్చాను. మా వారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయానికి క్యాండిల్ తయారీలో నాకు పూర్తి స్థాయిలో పట్టు వచ్చేసింది. ఇక కంపెనీ రిజిస్టర్ చేసి వ్యాపారాన్ని ప్రారంభించాను. నా టైమ్‌పాస్ కోసం మొదలు పెట్టిన ఈ ఆలోచన... ఇప్పుడు మా వారికి రిటైర్మెంట్ తర్వాత వ్యాపకంగా మారింది. నా ఆలోచనతో రూపుదిద్దుకున్న పరిశ్రమ ఇప్పుడు ఒక ఈవెంట్‌కి రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే క్యాండిల్స్‌ని సరఫరా చేసే స్థాయికి చేరింది. మాకు మంచి వ్యాపకం, మరికొందరికి ఉపాధి. నా పరిశ్రమ కాంతిమంతం చేస్తున్నది నా జీవితాన్ని మాత్రమే కాదు, వేలాది ఇళ్లను, లక్షలాది మనసులను’’ అన్నారామె వాలెంటైన్స్ డే క్యాండిల్స్ చూపిస్తూ. – వాకా మంజులారెడ్డి -
‘లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ’
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): సీఎం బొమ్మై ఆర్ఎస్ఎస్కు చెందినవారు కాదు. యడియూరప్పను తొలగించినప్పుడు లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ లభించింది. బొమ్మైను సాగనంపాలని మంత్రి ఈశ్వరప్ప యత్నిస్తున్నారు అని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. ఆదివారం బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకాలో కాంగ్రెస్ భేటీలో మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌వారు గాడ్సే వంశీకులని ఆరోపించారు. కాంగ్రెస్‌పై సీఎం విసుర్లు బొమ్మనహళ్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బు బలంతో గెలవాలని యత్నిస్తోందని సీఎం బసవరాజు బొమ్మై ఆరోపించారు. ఆదివారం బెంగళూరు శివార్లలోని ఆనేకల్ తాలూకా అత్తిబెలె వద్ద బీజేపి అభ్యర్థి గోపినాథ్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య పదేపదే బీజేపీ డబ్బులతో అధికారంలోకి వస్తోందని ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు కోటీశ్వరులకు టికెట్లు ఇస్తే, బీజేపీ సామాన్యులను పోటీలో నిలిపిందన్నారు. -
లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!
ఈజిప్ట్: ఒక్కసారి లాటరీ గెలిస్తేనే ఎగిరి గత్తేస్తాం. రెండూ సార్లు గెలిస్తే అబ్బో అదృష్టం అంటే మనదే అంటూ తెగ సంబరపడిపోతాం. కానీ ఏకంగా 20 సార్లు గెలిస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడొక వ్యక్తి కొనుగోలు చేసిన 20 టికెట్లకి లాటరీ తగిలింది. ఎవరా లక్కీ ఫెలో అని ఎగ్జాయింటింగ్ ఉన్నారా! (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....అలెగ్జాండ్రియాకు చెందిన విలియం నెవెల్ వర్జినియాలోని ఓ దుకాణం నుంచి ఆన్లైన్లో 20 ఒకేలాంటి టికెట్లు కొనుగోలు చేశాడు. అయితే నాలుగు టికెట్ల చొప్పున వరుసగా 5, 4, 1, 1 సంఖ్యలను ఎంచుకున్నాడు. ఇక అంతే వర్జినియా లాటరీ అధికారులు లాటరీ తీసిన ప్రతిసారి నెవెల్ కొనుగొలు చేసిన 20 టికెట్లకు 20 సార్లు గెలిచాడు. దీంతో నెవెల్ ప్రతి టికెట్‌కి 5 వేల డాలర్లు చొప్పున మొత్తం1,00,000 డాలర్లు (అంటే రూ.74 లక్షలు) గెలుచుకున్నాడు. ఏది ఏమైనా ఒకటి, రెండు సార్లు కూడా కాదు ఏకంగా 20 సార్లు అతను కొనగోలు చేసిన 20 టికెట్లుకు లాటరీ తగలడం విశేషం. (చదవండి: అది బైక్ ? విమానమా !) -
గోవాలో ‘మోని’
లక్కీఏకారి, నజియా జంటగా అర్కాన్ ఎంటరై్టన్మెంట్స్ బ్యానర్ పై రంజిత్ కోడిప్యాక సమర్పణలో తెలుగు , హిందీ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోని‘. సత్యనారాయణ ఏకారి దర్శకుడు. యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ–‘‘దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు బాగా నటిస్తున్నారు. ప్రస్తుతం గోవా షెడ్యూల్ పూర్తి కావొచ్చింది. రెండో షెడ్యూల్‌ని హైదారాబాద్‌లో, మూడో షెడ్యూల్ ముంబైలో జరపనున్నాం. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నాం. దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉంటాయి. ఇందులో ఓ ప్రముఖ బాలీవుడ్ విలన్ నటిస్తున్నాడు. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్లో మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి. -
లక్కుండాలట!
‘బోలెడన్ని తెలివితేటలు, విపరీతమైన టాలెంటు ఉన్నంత మాత్రాన సరిపోదు. కొంచెం లక్కుండాలి’ అనే మాట ఎవరో ఒకరు అనగా వినే ఉంటారు. లేకపోతే మీలో మీరే అనుకునే ఉంటారు. ఏదో జనాంతికంగా అనుకునే మాటలకు లేదా జనాభిప్రాయంగా వినిపించే మాటలకు శాస్త్రీయ ప్రామాణికత ఏముంటుందని ప్రశ్నించే మేధావులు కూడా మనలో ఉంటారు. అయితే, తెలివితేటలు, టాలెంటుతో పాటు కొంచెం లక్కుంటేనే బతుకు పోటీలో గెలుపు దక్కుతుందనే విషయం ఇటీవల వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో శాస్త్రీయంగా తేలింది. బిల్ గేట్స్ సహా గడచిన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఘన విజయాలను సాధించిన వెయ్యిమంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. సుదీర్ఘమైన కెరీర్లో విజయవంతంగా నిలదొక్కుకున్న వారికి తెలివితేటలు, ప్రతిభా పాటవాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చిందని, వారి ఘన విజయాల వెనుక అదృష్టమే ప్రధాన కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే, ఇటలీలోని సిసిలీ నగరంలో ఉన్న కటానియా వర్సిటీ పరిశోధకులు వెయ్యిమంది ‘వర్చువల్’ వ్యక్తులపై నిర్వహించిన ప్రయోగంలో కూడా అదృష్టం ముఖ్య భూమిక పోషిస్తుందని తేలడం విశేషం. -
పానీపూరీల కోసం ప్రాణాలు తీశారు!
న్యూఢిల్లీ: పానీపూరీలు ఎవరు ముందు కొనాలనేదానిపై మాటామాటా పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసేవరకు వెళ్లింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆగస్టు 4న వాయవ్య ఢిల్లీలోని భలాస్వా డైరీ ప్రాంతంలో జరిగింది. భలాస్వా ప్రాంతంలోని సింఘానియా గ్లాస్ గోదాము సమీపంలోని కచ్చీ గల్లీలో ఓ వ్యక్తి అపస్మాకర స్థితిలో పడిపోయి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టరు తెలిపారు. చనిపోయిన వ్యక్తి రాజీవ్ నగర్ కు చెందిన ఇర్ఫాన్ గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు అతనిని మోటారుసైకిల్‌పై తీసుకొచ్చి గల్లీలో పడేసి వెళ్లిపోయారని దర్యాప్తులో తేలింది. వాళ్లే ఇర్ఫాన్ ను హత్యచేసి ఉంటారని అనుమానించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. హత్య జరిగిన రోజు.. ఇర్ఫాన్, అతణ్ని చంపిన ఇద్దరు వ్యక్తులు ఓ పానీ పూరీ బండి దగ్గర తగువులాడుకున్నారు. పానీ పూరీ ఎవరికి ముందు ఇవ్వాలనే విషయమై జరిగిన గొడవలో బైక్ మీద వచ్చిన ఇద్దరూ ఇర్ఫాన్ ను కొట్టి చంపారు. సమీపంలోని సీసీటీవీల దృశ్యాల ఆధారంగా సునీల్ కుమార్(22), లక్కీ(21) అనే యువకులను పోలీసులు అరెస్టుచేశారు. -
నవ్వు
కోరిన అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది. రామచంద్రరావు చూడటానికి వెళ్లాడు. ధైర్యం చెప్పాడు. అలాగే ప్రతిరోజూ వెళ్లి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు. ఆమె దుఃఖం నుండి కోలుకుంది. రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అతనికి నవ్వడం ఒక స్వభావమైపోయినట్టూ, కష్టాలూ, చీకాకులూ అతనికి దూరంగా తొలగి వుంటాయన్నట్టు అనిపిస్తుంది. ఊళ్లో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు. అందరూ అతనికి స్నేహితులు. అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్లంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండ వంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి. కాని ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి. కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాద రేఖ గానీ, విసుగు గానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరచుకున్నాడు? తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు. ఆస్తీ, హోదా ఉన్నవాడు కాదు; ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ‘నా’ అన్నవాళ్లెవరూ ఉన్నట్టు కనబడరు. అతను ఒంటరివాడు. ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోనయిందనీ, ప్రయాణీకులకి చాలామందికి గాయాలు తగిలాయనీ విన్నాడు మూర్తి. వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు బాధపడ్డాడు. మూర్తి కంగారుపడ్డాడు. సరాసరి టిక్కెట్టు కొనుక్కుని ఏలూరు ఆస్పత్రికి వెళ్లాడు. గాయపడినవారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమయింది. అతని తలకీ చెంపలకీ కట్లు ఉన్నాయి. స్పృహ లేదు. మూర్తి గాభరాపడ్డాడు. తక్కిన గాయపడిన వారందరి దగ్గరా వారి వారి భార్యలూ తల్లిదండ్రులూ ఉన్నారు. రామచంద్రరావు మాత్రం వొంటరిగా మృత్యువుకీ, బ్రతుకుకీ మధ్య ఉన్న మసక మసక అంచుమీద ఉన్నాడు. మూర్తికి కళ్లనీళ్లు తిరిగాయి. ఇంత ఉత్తముడికి ఎందుకిటువంటి గతి పట్టింది అనుకున్నాడు. అతని మంచం పక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి. స్పృహ రాగానే - తనని చూస్తాడనీ, కావలించుకుని ఏడుస్తాడనీ అనుకున్నాడు. తనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎలాగ ఇతనికి ధైర్యం చెప్పి వోదార్చడం? ఎప్పటికోగాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు. అతడు కదలడం మొదలుపెట్టాడు. మూర్తి గుండెలు కొట్టుకున్నాయి దుఃఖంతో ఆనందావేశంతో. రామచంద్రరావు కళ్లు తెరిచాడు. ఓ నిముషం తదేకంగా మూర్తికేసి చూశాడు. ‘బతికే ఉన్నానా’ అంటూ నవ్వాడు. సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గవిడి తెల్లని పువ్వు రేకులను విచ్చుకుంటూన్నట్టు. మూర్తి ‘షాక్’ తిన్నాడు. అలాంటి విపత్సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు. తర్వాతి రోజున మాటల సందర్భంలో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మూర్తి అన్నాడు... ‘‘రామం నీవు పెళ్లి చేసుకోవాలి. ఇటువంటి సమయంలో నీకు భార్య ఉంటే ఎంత పరిచర్య చేసేది? ఇలా వొంటరిగా ఎన్నాళ్లు ఉంటావు?’’ రామచంద్రరావు జవాబుగా - నవ్వాడు. సరళ కనుక అంగీకరించి వుంటే రామచంద్రరావుకి యీ వొంటరితనం ఉండేది కాదు. సరళ రామచంద్రరావుకి దూరపు బంధువుల అమ్మాయి. సన్నగా నాజూకుగా ఉంటుంది. ఆమె కళ్లల్లో తెలివైన వెలుతురు ఉంది. సరళా రామచంద్రరావూ కలిసి చదువుకున్నారు. అప్పుడే వారిద్దరికీ స్నేహం కలిసింది. ఆ స్నేహం ప్రేమగా మారినట్లు కూడా మూర్తికి తెలుసును. రామచంద్రరావు మూర్తితో అన్ని సంగతులూ చెప్పేవాడు. ఆమె తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించేవాడు. సరళ తల్లిదండ్రులు కూడా ఏనాడూ వీరిరువురి స్నేహానికీ అభ్యంతరం చెప్పలేదు. సరళ తల్లిదండ్రులు కలవారు. సరళ ఒక్కర్తే వారి సంతానం. రామచంద్రరావుకి సరళతో పెళ్లి జరగాలనీ, దానితో అతని వొంటరితనమూ ఆర్థిక సమస్యా రెండూ తీరి సుఖిస్తాడనీ నిజమైన నిర్మలమైన స్నేహితుడైన మూర్తి ఎంతో ఆశించేవాడు. ‘‘రామం నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా?’’ అని అడిగాడు మూర్తి, రామచంద్రరావుకి ఉద్యోగం వచ్చిన రోజున. ‘‘సమయం రానీ’’ అన్నాడు రామచంద్రరావు. రెండు మూడు నెలల అనంతరం సరళా రామచంద్రరావులు పార్కులో కలుసుకున్నారు. విద్యుద్దీపాల కాంతీ, సప్తమి వెన్నెలా కలసి వీరు కూర్చున్న బెంచీమీద విచిత్రంగా పడింది. రామచంద్రరావు, తన మనస్సులోని అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు. కాని ఆ క్షణాన సరళ వివేకం ఆమె హృదయ దౌర్భల్యాన్ని జయించింది. ‘‘రామం, నీ ఆస్తి ఎంత?’’ అని అడిగింది. ‘‘ఒక పాత పెంకుటిల్లు, అదైనా మా వుళ్లో ఉంది’’ అన్నాడు రామచంద్రరావు. ‘‘భూమి గట్రా ఏమైనా...’’ అని ప్రశ్నించింది సరళ. ‘‘సెంటు భూమి కూడా లేదు’’ అని కులాసాగా జవాబు చెప్పాడు రామచంద్రరావు. ‘‘నీ జీతం ఎంత?’’ అని అడిగింది సరళ. ‘‘నూట యిరవై రూపాయలు’’ అన్నాడు రామం. సరళ నిట్టూర్చింది. ఆమె తన సాధక బాధకాలు, అవసరాలు, అలవాట్లూ తన తల్లిదండ్రుల కనీసపు కోర్కెలు అన్నీ చెప్పింది. చివరికి ప్రేమా యిష్టమూ మొదలైన దౌర్భల్యానికి లోబడి తన సుఖాన్నీ భద్రతనీ బలి యిచ్చుకోలేనంది. ‘‘నువ్వంటే నాకెప్పుడూ యిష్టమే, కాని నా జాగ్రత్తలో నేనుండాలిగా’’ అంది. పార్కులోంచి రామచంద్రరావు యివతలకి రాగానే మూర్తి ఎదురై ‘‘ఏమైంది, ఏమైంది’’ అని ఆతృతగా అడిగాడు. ‘‘నిరాకరించింది’’ అన్నాడు రామచంద్రరావు. మూర్తికి కోపం వచ్చింది రామచంద్రరావు మీద. అతనంత తాపీగా జవాబు చెప్పినందుకు కాదు, అతని పెదాల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వుని చూసి. ఏ ప్రేమ వైఫల్యానికి మనుష్యులు ఆత్మహత్య చేసుకుంటారో, ఏకాంతంలో పడి ఏడ్చి ఏడ్చి కృశించిపోతారో ఇటువంటి దానికి హాయిగా నవ్వగలిగే యీ రామచంద్ర రావులోని విశేషం ఏమిటి? ఇంత కులాసా, యింత ధీమా ఎక్కడవి అని విస్తుబోయాడు మూర్తి. సరళకి వివాహమైంది. పెళ్లికి రామచంద్రరావు వెళ్లాడు. వెళ్లి నాలుగు రోజులూ యిటు ఆడపెళ్లివారితో, అటు మగపెళ్లివారితో కలుపుగోలుతనంగా తిరిగాడు. అత్తింటికి వెళుతూన్న సరళతో ‘‘నీ భర్త రూపసి, ఉత్తముడు కూడా. నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుతున్నాను. వచ్చే ఏడాదికి నువ్వు పాపాయినెత్తుకొని రావాలి సుమా’’ అన్నాడు. అతని స్నేహ స్నిగ్ధ కంఠ స్వరానికి సరళ హృదయం ఆర్ద్రమయింది. కృతజ్ఞతతో సిగ్గుతో ‘‘థాంక్సు’’ అంది. కాని రామచంద్రరావు మనసారా కోరిన అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది. రామచంద్రరావు చూడటానికి వెళ్లాడు. ధైర్యం చెప్పాడు. అలాగే ప్రతిరోజూ వెళ్లి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు. ఆమె దుఃఖం నుండి కోలుకుంది. ఇంక ఇతని అవసరం తీరిందనుకున్న సరళ తండ్రి రామచంద్రరావుని చాటుగా పిలిచి ‘నువ్వు రోజూ యిలా రావడం బావుండదు. లోకం ఏదైనా అనుకుంటుంది’ అన్నాడు. రామచంద్రరావు నవ్వుతూ ‘మీరు చెప్పింది నిజమే ఇంక నేను రాను’ అని వెళ్లిపోయాడు. మళ్లీ సరళ దగ్గరకు ఎప్పుడూ వెళ్లలేదు. రామచంద్రరావు ఒక మూడు గదుల వాటా తీసుకొని అద్దెకు ఉంటున్నాడు. ఒక గది వంటగదిగా ఉపయోగించుకుని స్వయంగా వండుకు తింటాడు. తొమ్మిదింటికల్లా స్నానం చేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీసుకు బయలుదేరతాడు. దారిలో కిళ్లీకొట్టు పోలయ్యనీ, ప్లీడరు రాఘవ రావుగారినీ, వెంకయ్య మాష్టారినీ, పెరుగమ్ముకుని బతికే గోవిందమ్మనీ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఆఫీసుకు వెళతాడు. ఆఫీసులో అందరూ అతని మిత్రులు. ఆఫీసరు కూడా రామ చంద్రరావంటే దయగా అభిమానంగా ఉంటాడు. కాని రామచంద్రరావుని దురదృష్టమే వరించింది. ఆఫీసు రిట్రెంచిమెంటులో పైవాళ్లు అతన్ని ఉద్యోగం నుండి తొలగించి వేశారు. మూర్తి చాలా ఆందోళన చెందాడు. ఇక మీద రామచంద్రరావుకి గడిచే విధానం లేదు. అయినా రామచంద్రరావు ఏమీ బెదిరిపోలేదు. పైగా మూర్తికి అతడు నవ్వుతూ ధైర్యం చెప్పాడు. ఉద్యోగం పోయిన రెండు రోజులకే రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్లాడు. ఓ నెల్లాళ్లపాటు అక్కడే ఉండి, అతని పాత పెంకుటి లోగిలి అమ్మివేసి, మూడు వేల రూపాయలు చేత్తో పట్టుకొని తిరిగి వచ్చాడు. ఈసారి పాత మూడు గదుల పోర్షన్ వదిలేసి ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఒక టైపు మిషన్ కొని, ‘ఇచ్చట టైపు చేయబడును’ అని బోర్డు కట్టాడు. ఈ మూడువేలూ ఎన్నాళ్లు వస్తుంది? ఈ టైపు వల్ల వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది? నీ భవిష్యత్తు ఎలాగ? అని ఆతృత కనబరిచాడు మూర్తి. రామచంద్రరావు నవ్వాడు. ‘‘ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తీ. మనం చేసుకున్న కట్టుదిట్టాలు నిజంగా రక్షిస్తాయా?’’ అన్నాడు. రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్లిన రోజులలో సరళ తండ్రి చనిపోయి నట్టూ, ఇంటి యాజమాన్యమంతా సుకుమారమైన సరళ మీద పడినట్టూ తెలుసుకున్నాడు. ఒకసారి సరళను చూసి వచ్చాడు. ఆరు నెలలు గడిచాయి. రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది. పదిహేను రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. మూర్తి భయపడ్డాడు. తిన్నగా సరళ యింటికి వెళ్లాడు. రామచంద్రరావు పరిస్థితి వివరించి చెప్పాడు. ‘‘మీరు అతని బాధ్యత వహించాలి. ఒకనాడు మీరు అతన్ని మోసగించారు. కాని అతను ఏనాడూ మిమ్మల్ని నిందించలేదు. డబ్బుతో ఏమైనా కొనవచ్చు గాని అటువంటి అమృత హృదయాన్ని పొందలేము. మృత్యుముఖంలో ఉన్న అతన్ని కనికరించండి. లోకం ఏమనుకుంటుందో అనుకొని సంశయించకండి. ఒక్కడూ ఆ చిన్నగదిలో చీకటిలో బాధతో, వ్యాధితో చితికిపోతున్నాడు. వివేకం కన్న, హేతువు కన్న హృదయ ధర్మం గొప్పది. ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోరా’’ అని మూర్తి ప్రాధేయపడ్డాడు. అతను తల పెకైత్తి చూసేసరికి సరళ చెక్కిళ్లు కన్నీళ్లతో తడిసి ఉన్నాయ్. ‘‘పదండి నేనూ మీతో వస్తున్నాను’’ అంటూ సరళ ఎలా ఉన్నది అలా బయలుదేరింది. రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు. పక్కగదిలో డాక్టరు ‘ఇతను బతుకుతాడనే నమ్మకం లేద’ని చెప్పడం అప్పుడే మెలకువ వచ్చిన రామచంద్రరావుకి వినిపించింది. భయాందోళనతో కన్నీటితో సరళా, మూర్తీ రామచంద్రరావు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ‘‘నేను డాక్టరు చెప్పింది విన్నాను. దానికింత భయమెందుకు’’ అన్నాడు రామచంద్రరావు. అతని పెదవుల మీద చిరునవ్వు నిలిచి వుంది. కష్టాల్నీ బాధల్నీ చివరకు మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు. అంత ఆందోళనలోనూ ఆశ్చర్యచకితుడయ్యాడు మూర్తి. కాని రామచంద్రరావు సరళ సపరిచర్యలలో, మూర్తి నిరంతర సాన్నిధ్యంలో, పట్నం నుండి పిలిచిన పెద్ద డాక్టర్ల సహాయంతో వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. సరళ అతన్ని తన యింట్లో ఉండిపొమ్మని కోరింది, పూర్తిగా ఆరోగ్యం కోలుకునేవరకూ. మూడు నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియజేసి వెళ్లిపోతానన్నాడు. ‘‘నా గదికి వెళ్లిపోతాను మళ్లీ టైపు మొదలుపెట్టాలి. సెలవిప్పించు’’ అన్నాడు. ‘‘అయితే నేనూ వస్తాను. ఆ ఒక్క గదిలో మనమిద్దరమూ ఎలా ఉండడం?’’ అంది సరళ. ‘‘నువ్వు రావడమేమిటి? నాతో ఉండడమేమిటి?’’ అన్నాడు రామచంద్రరావు తెల్లబోయి. ‘‘మరి భార్య భర్తను వదిలి ఉంటుందా?’’ అంది సరళ తలవాల్చి వోరగా చూస్తూ. ఈసారి నిజంగా రామచంద్రరావు సిగ్గుపడి పోయాడు. అతను తెప్పరిల్లి చటుక్కున ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. సరళా రామచంద్రరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది. మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గాల్లేవు. మొదటి రాత్రి రామచంద్రరావు జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ మృదువుగా అడిగింది సరళ... ‘‘మీరు ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. కారణం ఏమిటి నాకు చెప్పరూ?’’ రామచంద్రరావు కళ్లలో గతస్మృతుల నీడలు బరువుగా నల్లగా కదిలాయి. కిటికీలోంచి చీకట్లోకి అలాగ కొంతసేపు చూస్తూ నిలుచున్నాడు. అతని కంఠస్వరం గంభీరంగా మారిపోయింది. ‘‘నా పదహారవయేట నేను, మా అమ్మా, నాన్నా, మా చెల్లెలూ, తమ్ముడూ భద్రాచలం వెడుతున్నాము. నేను అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఉండేవాణ్ని. ఎప్పుడేమయిపోతానో అని అమ్మా నాన్నా భయపడుతుండేవారు. భద్రాచల రాముని దర్శనంతో నేను ఆరోగ్యవంతుణ్ని అవుతానని వారి నమ్మకం. అందుకే భద్రాచలం వెడుతున్నాము. పాపికొండల దగ్గర హఠాత్తుగా మా పడవ బోల్తా కొట్టింది. కారణం ఏమిటో యిప్పటికీ నాకు తెలియదు. నేను స్పృహ లేకుండా ఒక ఒడ్డుకు కొట్టుకుపోయాను. తెలివి వచ్చేసరికి నా చుట్టూ జనం మూగి ఉన్నారు. మరికాస్త దూరంలో మా తల్లిదండ్రుల సోదర సోదరీ శవాలు పడివున్నాయి. వాళ్లందరూ చచ్చి పోయారు. ఒక్కసారిగా నేను దిక్కులేని వాడినయ్యాను. ఒక్కసారిగా అపార దుఃఖం నన్ను నిశ్చేష్టితుడ్ని చేసి వేసింది. గుండెలు పగిలిపోయినాయ్. మళ్లీ అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను. కాని ఒక మెరుపులాగ నా మనస్సులో ఏదో మెరిసింది. ఈ సృష్టి ఈ జీవితము అంతా ఒక హాస్యం. దీనికి ఒక నియమమూ నిర్ణీత పద్ధతీ అంటూ లేవు. ఉన్నా మనకి తెలియదు. మనం తెలుసుకోలేము. ఎవరో తెర వెనుక నుండి మనల్ని యిలా ఆడిస్తున్నారు. ఇది పెద్ద జోక్ - నవ్వులాట. లేనిదే అనారోగ్యంతో ఎప్పుడేమవుతానో అన్న నేను బతకడమేవిటి? నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్నవాళ్లు పోవడమేమిటి? ఈ అద్భుతమైన హాస్య నాటకములో నేనూ ఒక పాత్రని. కష్టాలకీ భయాలకీ రేపటి బాధలకి ఆందోళన చెందడం ఎంత తెలివితక్కువ సరళా? ఈ కాస్సేపటి బతుకునీ సంకుచితత్వంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవడం ఎంత మూర్ఖత్వం సరళా.’’ ఈ మాటలకి సరళ చలించిపోయింది. విద్యుద్దీపాల కాంతిలో అతని కళ్లు చెమ్మగిల్లినట్లు అనిపించిందామెకు. అతన్ని గుండెలకు హత్తుకుని, ‘‘నేను నిన్ను వదలను రామం’’ అని ఆవేశంగా అంది. రామచంద్రరావు చల్లగా నవ్వాడు తెల్లని మల్లెపూవు విరిసినట్లు, స్వచ్ఛమైన హిమకరణం సూర్యరశ్మిలో మిలమిల మెరిసినట్టు. సరళకి అర్థమయింది - అతని నవ్వు వట్టి నవ్వు కాదని. అతని నవ్వు వెనకాల భయంకర విషాదముంది. వేదాంతం వుంది. కాని యీనాటి వరకూ మూర్తికి మాత్రం అతని నవ్వుకి కారణం తెలియదు పాపం! -
అప్పుడే ఆయనతో నటించడం లక్కీనే..
చెన్నై: తాను సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమే అని అంటోంది ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, నటి గాబ్రియెల్లా దిమిత్రిడేస్. గతంలో సోనాలి కేబుల్ అనే హిందీ చిత్రంలో నటించిన ఆమె ఇప్పుడు తాజాగా నాగార్జున సరసన హీరయిన్గా నటిస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు కార్తీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి గాబ్రియెల్ తన అనుభవాలు తెలియజేస్తూ 'ఇది నాజీవితానికి ఒక కల. కెరీర్ ప్రారంభంలోనే నాగార్జునలాంటి హీరోతో పనిచేసే అవకాశం రావడం నాకు నేను చాలా అదృష్టం అని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఇంతకుమించి సినిమా వివరాలు తెలియజేయలేను' అని తెలిపింది. -
ఆ 8 మందీ అదృష్టవంతులే!
మన రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ సభ్యులుగా గెలిచిన వారిలో 8 మంది అదృష్టవంతులు ఉన్నారు. సాదారణంగా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు శాసనసభ స్థానాలు ఉంటాయి. వాటిలో కనీసం నాలుగు స్థానాలలో ఏ పార్టీ గెలుస్తుందో, ఆ పార్టీకి చెందిన అభ్యర్థే లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికవుతారు. ఒక పార్టీ నాలుగు కంటే తక్కువ స్థానాలలో గెలిచినా, ఆ పార్టీ అభ్యర్థే లోక్‌సభకు ఎన్నికైతే అదృష్టవంతుడిగా భావించవచ్చు. ఈ సారి ఎన్నికలలో ఆ విధమైన అదృష్టవంతుల జాబితాలో 8 మంది చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానంలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట శాసనసభ స్థానాలలో వైఎస్ఆర్ సిపి గెలిచింది. కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం స్థానాల్లో టీడీపీ గెలిచింది. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థి వర్మ గెలుపొందారు. టిడిపి మూడు స్థానాలే గెలిచినప్పటికీ అదృష్టం వరించడంతో లోక్‌సభకు ఆ పార్టీ అభ్యర్థి తోట నరసింహం గెలుపొందారు. బాపట్ల లోక్‌సభ స్థానంలో కూడా ఇదే పరిస్థితి. వేమూరు, రేపల్లె, పర్చూరులలో టిడిపి గెలిచింది. బాపట్ల, అద్దంకి, సంతనూతలపాడులలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు విజయం సాధించారు. చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ గెలిచారు. కానీ ఇక్కడ టిడిపి అభ్యర్థి మాల్యాద్రి శ్రీరామ్ లోక్‌సభ సభ్యుడుగా గెలిచారు. పిఠాపురంలో టిడిపి తిరుగుబాటు అభ్యర్థి గెలిస్తే, చీరాలలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి గెలిచారు. అయినా ఇక్కడ కూడా అదృష్టం వరించడంతో టిడిపి అభ్యర్థే ఎంపిగా విజయం సాధించారు. స్వంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన రెండు చోట్ల టిడిపి అభ్యర్థులే ఎంపిలుగా గెలిచారు. ఒంగోలు లోక్‌సభ స్థానంలో ఒంగోలు, దర్శి, కనిగిరి, కొండేపి శాసనసభ స్థానాలు నాలుగు చోట్ల టిడిపి అభ్యర్థులే గెలుపొందారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరులలో మాత్రమే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. అయినా అదృష్టం కలసి రావడంతో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి లోక్‌సభ సభ్యుడుగా గెలిచారు. తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ తిరుమల శ్రీవారి కరుణా కటాక్షం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వరప్రసాద రావుకి లభించింది. ఇక్కడ తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు. సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. టిడిపి నాలుగు చోట్ల గెలిచినప్పటికీ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వరప్రసాద్ విజయం సాధించారు. చిత్తూరు ఫలితం మరీ విచిత్రంగా ఉంది. టీడీపీ లోక్‌సభ అభ్యర్థి శివప్రసాద్ గొప్ప అదృష్టవంతుడు. ఇక్కడ చంద్రగిరి, నగరి, పూతలపట్టు, పలమనేరు, గంగాధర నెల్లూరు అయిదు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. చిత్తూరు, కుప్పం రెండు చోట్ల మాత్రమే టిడిపి అభ్యర్థులు గెలిచారు. అయినా టిడిపి అభ్యర్థి శివప్రసాద్ ఎంపిగా విజయం సాధించారు. దానికి ప్రధాన కారణం ఇక్కడ చంద్రబాబు నాయుడుకి 47 వేల ఓట్లు మెజార్టీ రావడమే. దాంతో శివప్రసాద్ విజయం సాధించారు. ఇక తెలంగాణలోని మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పినపాకలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి, భద్రాచలంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఎం అభ్యర్థి గెలిచారు. డోర్నకల్, ఇల్లందులలో కాంగ్రెస్ అభ్యర్థులు, మహబూబాబాద్, ములుగులలో టీఆర్ఎస్ అభ్యర్థులు, నర్సంపేటలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ కేవలం రెండు శాసనసభ నియోజకవర్గాలలోనే గెలిచిన టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థి సీతారాంనాయక్ లోక్‌సభకు ఎన్నికడం విశేషం! చేవెళ్లలో కూడా ఇదే పరిస్థితి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ రెండు శాసనసభ స్థానాలనే గెలుచుకున్నా టిఆర్ఎస్ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఎంపిగా ఎన్నికయ్యారు. ఇక్కడ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో టిడిపి, చేవెళ్ల, పరిగిలలో కాంగ్రెస్, వికారాబాద్, తాండూరులలో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయినా అదృష్టం కలసిరావడంతో లోక్‌సభకు టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని అదృష్టం వరించింది. ఇక్కడ వైరా, అశ్వరావుపేటలలో మాత్రమే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. ఖమ్మం, పాలేరు, మదిరలలో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సత్తుపల్లిలో టిడిపి, కొత్తగూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయినా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి శ్రీనివాస రెడ్డి విజయం సాధించడం విశేషం. ఈ విధంగా ఈ 8 మందిని అదృష్టవంతులుగా భావించవచ్చు. -
గాడ్‌ఫాదర్ ఆశీస్సులతో...
తొలిచూపులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన తార స్నేహా ఉల్లాల్. తొమ్మిదేళ్ల క్రితం ‘లక్కీ’ సినిమాతో తెరంగేట్రం చేశారామె. ఆ సినిమా సమయంలో అందరూ ఆమెను నిజంగా లక్కీ అన్నారు. ఐశ్వర్యారాయ్ పోలికలుండటం ఓ లక్. సల్మాన్‌ఖాన్ లాంటి సూపర్‌స్టార్ గాడ్‌ఫాదర్ అవ్వడం మరో లక్. తొలి సినిమాకే ఎక్కడలేని ప్రచారం లభించడం ఇంకో లక్. ఇలా స్నేహకు అన్నీ లక్కులే అన్నారంతా. తీరా సినిమా విడుదలయ్యాక ఆమెకు లక్ అంతగా కలిసి రాలేదు. ఇక చేసేది లేక దక్షిణాది బాట పట్టారామె. ఇక్కడ కూడా అర కొర విజయాలే దక్కడంతో మళ్లీ ముంబై చేరుకున్నారామె. ఇటీవల సల్మాన్... ‘బెల్లీ డాన్స్ నేర్చుకో.. నీ కెరీర్‌కి అది బాగా ఉపయోగపడుతుంది’ అని స్నేహకు ఓ సలహా ఇచ్చారట. గాడ్‌ఫాదర్ మాటను పాటిస్తూ ‘బెల్లీ డాన్స్’లో ప్రావీణ్యం సంపాదించి, సల్మాన్‌ని కలిశారట స్నేహా ఉల్లాల్. ఆమెలోని పట్టుదల సల్మాన్‌ని కట్టిపడేసిందట. తత్ఫలితంగానే... ‘బేజుబాన్’ అనే సినిమాలో కథానాయికగా నటించే బంపర్ ఆఫర్ స్నేహను వరించింది. వచ్చే వారమే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందట. ఇది అద్భుతమైన ప్రేమకథ అని, ఈ అవకాశం రావడానికి కారకుడైన తన గాడ్‌ఫాదర్ సల్మాన్‌కి కృతజ్ఞతలని తెగ సంబరపడిపోతోంది స్నేహా ఉల్లాల్. మరి స్నేహ బాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.