
లక్కీఏకారి, నజియా జంటగా అర్కాన్ ఎంటరై్టన్‌మెంట్స్ బ్యానర్ పై రంజిత్ కోడిప్యాక సమర్పణలో తెలుగు , హిందీ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోని‘. సత్యనారాయణ ఏకారి దర్శకుడు. యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ–‘‘దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు బాగా నటిస్తున్నారు. ప్రస్తుతం గోవా షెడ్యూల్ పూర్తి కావొచ్చింది.
రెండో షెడ్యూల్‌ని హైదారాబాద్‌లో, మూడో షెడ్యూల్ ముంబైలో జరపనున్నాం. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నాం. దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉంటాయి. ఇందులో ఓ ప్రముఖ బాలీవుడ్ విలన్ నటిస్తున్నాడు. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్‌లో మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి.
Comments
Please login to add a commentAdd a comment