కామెడీ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘జస్ట్‌ ఏ మినిట్‌’ | Just A Minute Trailer Out | Sakshi
Sakshi News home page

కామెడీ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘జస్ట్‌ ఏ మినిట్‌’

Published Sun, Jul 14 2024 8:32 AM | Last Updated on Sun, Jul 14 2024 8:32 AM

Just A Minute Trailer Out

అభిషేక్‌ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జస్ట్‌ ఏ మినిట్‌’. కామెడీ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను యశ్వంత్‌ దర్శకత్వంలో తన్వీర్, ప్రకాశ్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో హీరో అభిషేక్‌ మాట్లాడుతూ –‘‘సినిమా మొత్తం ఫన్‌ ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. బాజీ మ్యూజిక్‌ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ వేడుకలో నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, సారిపల్లి సతీష్, జబర్దస్త్‌ ఫణి మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement