‘బోలెడన్ని తెలివితేటలు, విపరీతమైన టాలెంటు ఉన్నంత మాత్రాన సరిపోదు. కొంచెం లక్కుండాలి’ అనే మాట ఎవరో ఒకరు అనగా వినే ఉంటారు. లేకపోతే మీలో మీరే అనుకునే ఉంటారు. ఏదో జనాంతికంగా అనుకునే మాటలకు లేదా జనాభిప్రాయంగా వినిపించే మాటలకు శాస్త్రీయ ప్రామాణికత ఏముంటుందని ప్రశ్నించే మేధావులు కూడా మనలో ఉంటారు. అయితే, తెలివితేటలు, టాలెంటుతో పాటు కొంచెం లక్కుంటేనే బతుకు పోటీలో గెలుపు దక్కుతుందనే విషయం ఇటీవల వార్‌విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో శాస్త్రీయంగా తేలింది. బిల్ గేట్స్ సహా గడచిన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఘన విజయాలను సాధించిన వెయ్యిమంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు.
సుదీర్ఘమైన కెరీర్‌లో విజయవంతంగా నిలదొక్కుకున్న వారికి తెలివితేటలు, ప్రతిభా పాటవాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చిందని, వారి ఘన విజయాల వెనుక అదృష్టమే ప్రధాన కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు వార్‌విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే, ఇటలీలోని సిసిలీ నగరంలో ఉన్న కటానియా వర్సిటీ పరిశోధకులు వెయ్యిమంది ‘వర్చువల్’ వ్యక్తులపై నిర్వహించిన ప్రయోగంలో కూడా అదృష్టం ముఖ్య భూమిక పోషిస్తుందని తేలడం విశేషం.
లక్కుండాలట!
Mar 9 2018 12:45 AM | Updated on Mar 9 2018 12:45 AM
Advertisement
Advertisement